📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం..సినీ ప్రముఖుల సంతాపం

Author Icon By Anusha
Updated: June 12, 2025 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.అహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో యావత్‌ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఘటనపై పలువురు సినీతారలు విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు.విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదలో చనిపోయిన వారి కుటుంబీకుల దుఃఖాన్ని ఊహించడం కష్టమని అందరికీ తట్టుకునే బలాన్ని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పరిణీతి పేర్కొంది.

మాటల్లో వ్యక్తపరచడం

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)సైతం విచారం వ్యక్తం చేసింది.అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందనే వార్త విని తాను షాక్‌కు గురయ్యాయని పేర్కొంది. ఇలాంటి విషాదాల బాధను మాటల్లో వ్యక్తపరచడం అసాధ్యమని ప్రయాణీకులు, సిబ్బంది బాధిత ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నట్లు జాన్వీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

ఇలాంటి సమయంలో

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తన ముంబయిలో నిర్వహించాల్సిన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. సల్మాన్‌ ముంబయిలోని ఓ హోటల్‌ జరిగే మీడియా కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న సీనియర్‌ నటుడు తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో సంబరాలు చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని విమాన ప్రమాదం తీవ్రమైందని దేశవ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారన్నారు. గురువారం మధ్యాహ్నం సల్మాన్‌(Salman Khan) ఓ హోటల్‌లో ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) మీడియా కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరు కావాల్సి ఉంది.

ఆకాంక్షిస్తున్నట్లు

ఈ ఘటనపై బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌(Sunny Deol) సైతం స్పందించారు. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద వార్త విని నేను షాక్ అయ్యానని ప్రమాదంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు శాంతించాలన్నారు. ఈ ఘటనపై హీరోయిన్‌ శోభితా ధూలిపాళ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

క్లిష్ట సమయంలో

విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్‌ అయ్యానని బాధితుల కుటుంబాలు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నానని ఈ క్లిష్ట సమయంలో అందరి కోసం ప్రార్థించాలన్నారు. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌(Sara Ali Khan), అక్షయ్‌ కుమార్‌, సోనూసూద్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో పాటు మరికొందరు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Read Also: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం..రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి

#AirIndiaCrash #FlightAI171 #Janhvi Kapoor #Parineeti Chopra Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.