గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్(Meghani Nagar) పరిధిలోని ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది.
ప్రత్యక్ష సాక్షులు
విమానం రన్‌వే పైనుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విమానం అదుపుతప్పి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పినట్లు సమాచారం. ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.ఈ సంఘటనకు సంబంధించి విమానాశ్రయ అధికారులు, డీజీసీఏ (Directorate General of Civil Aviation) అధికారులు విచారణ ప్రారంభించారు.
ప్రముఖ వ్యక్తులు
ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో సాధారణ ప్రయాణికులే కాకుండా ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(Vijay Rupani) కూడా ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే, అందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపినప్పటికీ, ప్రయాణికులలో ఆందోళన నెలకొంది.
Read Also: Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్