📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

విరిగిన సీటులో కూర్చుని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి

Author Icon By Vanipushpa
Updated: February 22, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిరిండియా విమానంలో ఆయన విరిగిన సీటులో కూర్చుని గంటన్నర పాటు ప్రయాణించాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీ ప్రయాణించారు. ఎయిరిండియా విమానం ఎక్కిన ఆయన తాను బుక్ చేసుకున్న సీటు విరిగిపోయి ఉండడాన్ని గుర్తించారు. దాంతో ఆయన విమానసిబ్బందిని పిలిచి, సీటు విరిగిపోయిన విషయం వారికి తెలియజేశారు. విమానంలో ఇదొక్కటే కాదు… మరి కొన్ని సీట్లు కూడా విరిగిపోయి ఉన్నాయన్న సమాధానం వారి నుంచి వినిపించింది.

విరిగిన సీటులోనే ఢిల్లీకి..

ఈ విషయం మేనేజ్ మెంట్ కు కూడా తెలుసని, విరిగిన సీటును ఎవరికీ కేటాయించవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని వారు కేంద్రమంత్రికి తెలిపారు. కాగా, ఆ విమానంలో తాను పడుతున్న ఇబ్బందిని గమనించి ఇతర ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని ఆఫర్ చేశారని, అయితే వారిని ఇబ్బందిపెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో విరిగిన సీటులోనే కూర్చుని ఢిల్లీ వచ్చానని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు.
విరిగిపోయిన సీట్లు కేటాయించడం మోసపూరితం
ఎయిరిండియా సంస్థను టాటా గ్రూప్ హస్తగతం చేసుకున్నాక, ఆ విమానయాన సంస్థ పరిస్థితులు బాగుపడతాయని భావించానని, కానీ, అది తన భ్రమ అని ఇప్పుడు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఓ టికెట్ కు పూర్తి ఛార్జీ వసూలు చేసినప్పుడు, ఇలాంటి విరిగిపోయిన సీట్లు కేటాయించడం మోసపూరితం కాదా అని శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి ట్వీట్ పై ఎయిరిండియా స్పందించింది. ఆయనకు క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది.

#telugu News A Union Minister Ap News in Telugu Breaking News in Telugu broken seat Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news traveled

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.