📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

అపార్ కార్డ్‌తో తల్లిదండ్రులకు కొత్త కష్టాలు

Author Icon By Vanipushpa
Updated: February 18, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్‌ తరహాలో అపార్‌ (Automated Permanent Academic Account Registry – APAAR) గుర్తింపు కార్డు అందుబాటులోకి రానుంది. ‘వన్‌ నేషన్‌- వన్‌ ఐడీ’ పేరుతో 17 అంకెలుండే ఈ కార్డులు ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందించారు.
పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు తప్పనిసరి
దేశంలోని అన్ని ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ఈ కార్డు జారీ చేయ‌నున్నారు. అపార్ కార్డు పేరుతో దీన్ని తీసుకురానున్నారు. అపార్‌కార్డ్ అంటే ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ . కేంద్ర‌ప్ర‌భుత్వం అపార్ కార్డ్ పేరుతో వన్‌ నేషన్-వన్‌ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. కానీ ఈ తరహాలో తల్లిదండ్రులకు కొన్నిఇబ్బందులకు గురవుతున్నారు. పేరెంట్స్ తమ పేర్లను, చిరునామాలు అక్షర దోషాలు లేకుండా సమర్పించాలి. దీనితో వారు మీ సేవ చుట్టు తిరుగుతున్నారు. గంటలకొద్దీ వీటికోసం వేచి వుండాలి. జాబ్ చేసే తల్లులకు ఈ ప్రాసెస్ కోసం సెలవులకు తీసుకునేందుకు ఇబ్బందిగా వుంటున్నది.

విద్యార్థి కుటుంబ వివరాలు

ఈ ఆపార్ కార్డ్ బాధ్య‌త‌ను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే దీనికి ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించనున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ఈ ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు తదితర వివరాలన్నీతెలుసుకోవ‌చ్చు. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది.

17 అంకెలున్న నంబర్‌
ఈ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే ద‌గ్గ‌ర పొందుప‌రిచేలా చేస్తోంది కేంద్రం. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. అన్ని వివ‌రాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగ‌ప‌డేలా చేయ‌నుంది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించ‌డం జ‌రుగుతుంది. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా ప‌రిగ‌ణించ‌నున్నారు.

#telugu News A new hardship Ap News in Telugu Apar card Breaking News in Telugu Google News in Telugu india Latest News in Telugu Paper Telugu News parents Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.