📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Costly Dog: కొంప ముంచిన ప్రచారం..రంగంలోకి ఈడి అధికారులు

Author Icon By Vanipushpa
Updated: April 18, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు నివాసితుడు ఎస్.సతీష్ అలియాస్‌ డాగ్‌ సతీశ్‌ అసలు కథ బయటపడింది. సతీష్ ఇటీవల రూ.50 కోట్లు వెచ్చించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క వోల్ఫ్‌డాగ్‌ను కొన్నానని ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సతీష్ పై ఈడీ అధికారులకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిలో హవాలా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా షాకింగ్ విషయాలు గుర్తించారు.
‘కాడబోమ్స్ ఒకామి’ అనే కుక్క
అమెరికా నుంచి ‘కాడబోమ్స్ ఒకామి’ అనే కుక్కను కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్క అని సతీశ్‌ చెప్పాడు. ఈ జాతి తోడేలు, కాకేసియన్ షెపర్డ్ మిశ్రమం అని ప్రచారం చేసుకున్నాడు. అలాంటి కుక్క ఇండియాకు రావడం ఇదే తొలిసారి అని ఊదరగొట్టాడు. దీంతో బెంగళూరులోని జేపీ నగర్‌లోని సతీష్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు జరిపారు. రూ.50 కోట్ల విలువైన కుక్కను కొనుగోలు చేయలేదని, అలాంటి పత్రం లేదా రుజువు ఏదీ తన దగ్గర లేదని తేల్చారు. మీడియాలో ఫేమస్ అయ్యేందుకే సతీష్ ఇదంతా చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

దర్యాప్తులో అసలు విషయాలు
అంతేకాదు ఆ కుక్కను చూపించమని సతీష్‌ని అధికారులు అడిగారు. కానీ ఆ కుక్క కూడా తనది కాదని, తన స్నేహితుడి దగ్గర ఉందని చెప్పాడు. సతీష్ తనను తాను పెద్ద కుక్కల పెంపకందారునిగా చెప్పుకుంటాడు. కానీ దర్యాప్తులో అతను ఆర్థికంగా బలహీనుడని, కోట్ల విలువైన కుక్కను కొనగలిగే ఆస్తి లేదా ఆదాయం అతనికి లేదని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. సతీశ్‌పై ఫిర్యాదుల ఆధారంగా ఈడీ అతని ఆదాయం, ఖర్చులపై దర్యాప్తు జరిపింది. సతీష్ అబద్ధాన్ని ఎందుకు వ్యాప్తి చేశాడో తెలుసుకోవడానికి ఈడీ ఎంక్వైరీ చేసింది. వాస్తవానికి అతనికి అంత సీన్‌ లేదని అధికారులు తేల్చినట్లు సమాచారం.

Read Also: Bengal : టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

#telugu News A campaign full of lies Ap News in Telugu Breaking News in Telugu ED officials enter the fray Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.