हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

నేత‌ల్ని త‌ప్పుప‌ట్టిన కంగ‌నా రనౌత్‌

Vanipushpa
నేత‌ల్ని త‌ప్పుప‌ట్టిన కంగ‌నా రనౌత్‌

గత కొంతకాలంగా ఎమ‌ర్జెన్సీ చిత్రంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా ఎమ‌ర్జెన్సీ ఫిల్మ్‌కు బ్రిట‌న్ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ మ‌ద్ద‌తు తెలిపారు. ఫిల్మ్ స్క్రీనింగ్‌ను అడ్డుకోవ‌డం భావ స్వేచ్ఛ‌కు వ్య‌తిరేకం అన్నారు. బాబ్ బ్లాక్‌మాన్ పార్ల‌మెంట్‌లో మాట్లాడిన వీడియోను న‌టి కంగ‌నా ర‌నౌత్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. భార‌తీయ నేత‌ల్ని ఆమె త‌ప్పుప‌ట్టారు. బ్రిట‌న్‌లో ఎమ‌ర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొంద‌రు సిక్కులు అడ్డుకున్నారు. ఆ చిత్రం ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల వ‌ద్ద ఆందోళ‌న నిర్వ‌హించారు. దీంతో ఆ ఫిల్మ్ స్క్రీనింగ్‌ను ర‌ద్దు చేశారు. దీన్ని బ్రిట‌న్ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ ఖండించారు. భావ స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డం స‌రికాదు అని ఆ క‌న్జ‌ర్వేటివ్ నేత యూకే పార్ల‌మెంట్‌లో మాట్లాడారు. దానికి చెందిన వీడియోను కంగ‌నా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. త‌న చిత్రానికి బ్రిట‌న్ ఎంపీ మ‌ద్ద‌తు ప‌లికార‌ని, కానీ భార‌తీయ రాజ‌కీయ‌వేత్త‌లు, ఫెమినిస్టులు మౌనంగా ఉన్న‌ట్లు ఆమె ఆరోపించారు.

ఎమ‌ర్జెన్సీ చిత్ర ప్ర‌ద‌ర్శ‌నను అడ్డుకున్న అంశంపై భార‌తీయ విదేశాంగ శాఖ‌.. బ్రిట‌న్‌తో చ‌ర్చించింది. విదేశాంగ శాఖ త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను వెల్ల‌డించింది. హారో వూ సినిమా హాల్‌లో ఎమ‌ర్జెన్సీ ఫిల్మ్ స్క్రీనింగ్‌ను కొంద‌రు ప్రో ఖ‌లిస్తానీయులు అడ్డుకున్నారు. సుమారు 40 నిమిషాల సినిమా ముగిసిన త‌ర్వాత‌.. మాస్క్‌లు ధ‌రించిన ఖ‌లిస్తానీ మ‌ద్ద‌తుదారులు ఆ ఫిల్మ్ ప్ర‌ద‌ర్శ‌న నిలిపివేశారు. చిత్రాన్ని తిల‌కిస్తున్న ప్రేక్ష‌కుల్ని బెదిరించి బ‌య‌ట‌కు పంపించారు. దీన్ని ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ త‌ప్పుప‌ట్టారు. ఫిల్మ్ స్క్రీనింగ్‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌వ‌చ్చు కానీ, ప్రాథ‌మిక హ‌క్కు అయిన భావ స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డం స‌రికాద‌న్నారు.మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవిత‌క‌థ ఆధారంగా ఎమ‌ర్జెన్సీ చిత్రాన్ని తీశారు. న‌టి కంగ‌నా ర‌నౌత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ ఫిల్మ్‌లో ఇందిర పాత్ర‌ను కూడా కంగ‌నే పోషించారు. ప్ర‌ధానిగా ఇందిర తీసుకున్న అనేక కీల‌క నిర్ణ‌యాల‌ను చిత్రంలో చూపించారు. కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను అత్య‌ద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870