Narendra Modi: మరికాసేపట్లో అమరావతికి చేరుకోనున్న మోదీ

Read Time:  1 min
Prime Minister: నా పక్కన వీరిద్దరినీ చూసి కొందరికి ఈ రోజు నిద్ర పట్టదు: మోదీ
Prime Minister: నా పక్కన వీరిద్దరినీ చూసి కొందరికి ఈ రోజు నిద్ర పట్టదు: మోదీ
FONT SIZE
GET APP

2025 మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఎన్నో సంవత్సరాల పోరాటాలకు, ఆలస్యాలకు ముగింపు పలుకుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇవాళ అధికారికంగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ మహత్తర కార్య‌క్ర‌మానికి ప్రధాని న‌రేంద్ర మోదీ హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తిరువనంతపురం నుంచి ప్రయాణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఘనంగా స్వాగతం పలికారు. మోదీ అక్కడి నుంచి ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో నేరుగా అమరావతి సచివాలయం హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వీరంగా సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు అమరావతిలోని సభాస్థలి లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది. ప్రధాని రాక సందర్భంగా అమరావతిలోని సభాస్థలికి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. రైతులు, మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు – అందరూ అమరావతి కోసం ఏకమై ప్రదర్శించిన ఉత్సాహం ప్రశంసనీయంగా మారింది.

Read also: Religion: మతం మారితే ఎస్సీ హోదా రద్దు తేల్చి చెప్పిన హైకోర్టు

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.