ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ప్రణాళిక తయారైంది.
ఈ డాక్యుమెంట్‌లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక ముఖ్యాంశాలు పొందుపరచబడ్డాయి. ప్రత్యేకంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు వంటి రంగాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన వ్యూహాలు రూపొందించారు. సాంకేతికత వినియోగంలో ముందు వరుసలో ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మలచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.
స్వర్ణాంధ్ర@2047 దృష్టి ప్రధానంగా యువతపై నిలిపింది. నిరుద్యోగ సమస్యలను తగ్గించడంతోపాటు, యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను అందించడంపై ప్రాధాన్యత ఇవ్వబడింది. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయడం, ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్తు, తాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మెరుగుపరచడం, వ్యాపారాలకు అనుకూలమైన విధానాలు రూపొందించడం ఈ డాక్యుమెంట్‌లో కీలక అంశాలుగా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ, నూతన శక్తి వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను తీసుకొస్తున్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్రానికి ప్రగతి దిశగా మరింత దోహదం చేస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు విశ్వసిస్తున్నారు. స్వర్ణాంధ్ర@2047 రూపకల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని చంద్రబ చెప్పుకొచ్చారు. ప్రజల సహకారం, పారదర్శక పాలనతో ఈ లక్ష్యాలను సాధించడంలో విజయవంతం అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.