టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈమూవీతోపాటు మరోవైపు ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. దసరా సినిమాతో నాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో నాని ఊహించని లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మూవీ టీమ్
మూవీ స్క్రిప్ట్ పట్ల నాని అసంతృప్తిగా ఉన్నారని, బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై మూవీ టీమ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పుకార్లు సృష్టించేవారిని జోకర్లతో పోలుస్తూ ట్వీట్ చేసింది.’ది ప్యారడైజ్’ పనులు అనుకున్న విధంగానే జరుగుతున్నాయి.ఈ ప్రాజెక్ట్ సరైన మార్గంలోనే ఉంది. నిశ్చింతగా ఉండండి. దీన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో మీరు త్వరలోనే చూస్తారు. ఈలోగా మీకు వీలైనంత ఎక్కువ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ‘గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి.మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను గమనిస్తున్నాం.అలాగే నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్న వారిని గమనిస్తున్నాం. వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాం.టాలీవుడ్ చరిత్రలోనే ది ప్యారడైజ్ గర్వించే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ అంతా గర్వపడే సినిమాతో నాని మీ ముందుకు వస్తారని వాగ్దానం చేస్తున్నాం” అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది.
పోస్టర్‌లో తుపాకీని పట్టుకుని ఉన్న నానిని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. చిత్రం ఫ్యాన్స్‌కి కనుల పండుగగా ఉంటుందని ముచ్చటించుకుంటున్నారు.ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.ది ప్యారడైజ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 26న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుందని టాక్. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.