ఐపీఎల్ 2025లో భాగంగా ,ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆతిథ్య జట్టును 7వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదుచేసి ప్లేఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. నిర్ణీత ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ట్రెంట్ బౌల్ట్ (4/26), దీపక్ చాహర్ (2/12) ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఛేదనను ముంబై 15.4 ఓవర్లలోనే పూర్తిచేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది ఆరో ఓటమి. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు అడుగంటినట్టే. వరుస పరాభవాలు ఎదురవుతున్నా ఐపీఎల్-18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆటతీరులో మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతో పాటు సొంత మైదానంలోనూ సన్‌రైజర్స్ బొక్కబోర్లా పడుతున్నది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలుపు బాట పట్టాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో చేతులెత్తేసింది.
పెవిలియన్
2025లో ఘోరంగా విఫలమవుతున్న ట్రావిస్ హెడ్ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తూ డకౌట్ అయ్యాడు. బౌల్ట్ రెండో ఓవర్లోనే హెడ్‌ను ఔట్ చేసి ఎస్‌ఆర్‌హెచ్ పతనానికి నాంది పలికాడు. అతడే తన మరుసటి ఓవర్లో అభిషేక్ (8)నూ పెవిలియన్‌కు పంపాడు. చాహర్ మూడో ఓవర్లో ఇషాన్ కిషన్ (1) అత్యుత్సాహానికి పోయి పెవిలియన్ చేరాడు. నితీశ్ రెడ్డి (2), అనికేత్ వర్మ (12) కూడా వారి బాటనే అనుసరించారు. 6 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 24/4. 2025 సీజన్ పవర్ ప్లేలో ఇదే అత్యంత చెత్త స్కోరు.

సూర్యకుమార్
సన్‌రైజర్స్ తడబడ్డ పిచ్‌పై ముంబై లక్ష్యాన్ని సాఫీగా దంచేసింది. బౌండరీతో చేధన ప్రారంభించిన రికెల్టన్ (11) త్వరగానే పెవిలియన్ చేరినా చెన్నై మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన ముంబైచా రాజా (రోహిత్).. అదే జోరును కొనసాగించాడు. కమిన్స్ 3వ ఓవర్లో 6, 4 బాదిన హిట్‌మ్యాన్ బౌలింగ్‌లోనూ 4, 6 దంచాడు. మరో ఎండ్‌లో విల్ జాక్స్ (22) రోహిత్‌కు అండగా నిలవడంతో ముంబై స్వల్ప లక్ష్యాన్ని వేగంగా కరిగించింది. కమిన్స్ బౌలింగ్లో బౌండరీతో 35 బంతుల్లో రోహిత్ ఫిఫ్టీ పూర్తయింది. పదో ఓవర్లో అన్సారీ.. జాక్స్‌ను ఔట్ చేసినా ఆ ప్రభావం ముంబైపై పడలేదు. సూర్యకుమార్ (40) సాయంతో రోహిత్ ముంబై విజయాన్ని ఖాయం చేశాడు. విజయానికి 13 పరుగుల దూరంలో రోహిత్ ఔటైనా సూర్య, తిలక్ లాంఛనాన్ని పూర్తిచేశారు.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్