తప్పుడు ప్రచారం చేయొద్దు: మోహన్ బాబు

Read Time:  1 min
Mohan Babu 1
Mohan Babu 1
FONT SIZE
GET APP

జర్నలిస్టులపై దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని మంచు మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని చెబుతూ.. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. కోర్టు తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రజలకు వెల్లడించాలని మీడియాకు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని మోహన్ బాబు కోరారు. గత కొంతకాలంగా మంచు మనోజ్ కు, మోహన్ బాబుల మధ్య ఆస్తుల గొడవలు జరుగుతున్న సంగతి తెలిసేందే.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.