Suriya46 movie update : కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన 46వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తాత్కాలికంగా #Suriya46గా పిలుస్తున్నారు. నాగ వంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “ఇంకా రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. సూర్య పాత్ర గజిని లోని సంజయ్ రామస్వామి పాత్ర తరహాలో ఉంటుంది” అని తెలిపారు. ఈ సినిమా కథ 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మరియు 20 ఏళ్ల యువతి మధ్య ఏర్పడే సంబంధాన్ని చూపిస్తుందని చెప్పారు.
Read Also: Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ
వారి మధ్య ఉండే అనుబంధం, సరదా క్షణాలు, ప్రేమను ఈ సినిమాలో చూపిస్తారని నాగ వంశీ వివరించారు. ఇంత పెద్ద వయసు తేడా ఉన్న ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమలో పడగలరా? అనే ప్రశ్నను ఈ సినిమా లేవనెత్తుతుందని ఆయన అన్నారు. ఈ కథాంశం ప్రేక్షకుల్లో చర్చలకు దారి తీస్తోంది.
ఈ ప్రకటనతోనే సినిమా కథపై సోషల్ మీడియాలో భిన్న (Suriya46 movie update) అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సున్నితమైన కథను దర్శకుడు వెంకీ అట్లూరి ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల లక్కీ భాస్కర్తో మెప్పించిన వెంకీ అట్లూరి, ఈసారి కూడా అదే స్థాయి సినిమా ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. తాజా సంచలనం మమిత బైజు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: