‘గేమ్ ఛేంజర్’ సీక్వెల్ పై శ్రీకాంత్ క్లారిటీ

Read Time:  1 min
gamechanger song
gamechanger song
FONT SIZE
GET APP

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, ఈ మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “రామ్ చరణ్ ఈ సినిమాలో ‘అప్పన్న’ అనే పాత్రలో కనిపిస్తాడు. ఇది ఆయన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్ర. చరణ్ నటన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పాత్రలో ఆయన చాలా కొత్తగా, ఎమోషనల్‌గా కనిపిస్తాడు” అని తెలిపారు.

అలాగే, ఈ సినిమాలో ప్రముఖ నటుడు SJ సూర్య నటన గురించి కూడా శ్రీకాంత్ ప్రస్తావించారు. “సూర్య గారి పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆయన గత చిత్రమైన ‘సరిపోదా శనివారం’లో చూపించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను మించి ఉంటుందని గ్యారంటీగా చెప్పగలను” అని పేర్కొన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చరణ్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇందులో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.