📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

RC16 షూటింగ్ స్పాట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్!

Author Icon By vishnuSeo
Updated: February 6, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న RC16 చిత్రం షూటింగ్ ప్రదేశంలో ఓ ప్రత్యేక అతిథి సందడి చేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేడు హైదరాబాద్‌లో జరిగింది.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారతో షూటింగ్ ప్రాంతంలో కనిపించారు. లొకేషన్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షూటింగ్ ప్రదేశంలో తన కుమార్తె చేయి చాచి ఏదో చూపిస్తుండగా రామ్ చరణ్ ఆమెను చూస్తూ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘RC 16’ అనే వర్కింగ్ టైటిల్ తో గతేడాది చివర్లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇప్పటికే మైసూర్ లో ఓ చిన్న షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసారు.

లేటెస్టుగా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే బుధవారం (ఫిబ్రవరి 5) సాయంత్రం ఈ మూవీ సెట్లోకి ఓ స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ అతిథి మరెవరో కాదు.. మెగా వారసురాలు క్లిన్ కారా. RC16 షూటింగ్ లొకేషన్ కి రామ్ చరణ్ గారాలపట్టి క్లిన్ కారా కొణిదెల అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చెర్రీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ముద్దుల కుమార్తెను ఎత్తుకొని ఉన్న ఓ ఫొటోకు షేర్ చేస్తూ.. ”సెట్‌లో నా లిటిల్ గెస్ట్” అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో క్లిన్ కారా దేన్నో చూపిస్తుండగా.. చరణ్ నవ్వుతూ తన కూతురిని చూస్తున్నారు. మెగా తండ్రీకూతురు కలిసి ఉన్న ఈ ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి చీఫ్ గెస్టుగా హాజరైన రామ్ చరణ్.. క్లింకార తనను నాన్న అని పిలిచే వరకూ కుమార్తె ఫేస్ చూపించనని అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు తన కుమార్తె ముఖం కనిపించకుండా బ్యాక్ సైడ్ లుక్ నే ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. అయినా సరే ఈ పిక్ మెగా అభిమానులకు ఆకర్షిస్తోంది. గ్లోబల్ స్టార్ తో కలిసి లిటిల్ ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఉపాసన కామినేని కొణిదెల కూడా స్పందించింది. FOMO (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) అంటూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది.నిజానికి రామ్ చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండరు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే ఆయన అకౌంట్స్ నుంచి పోస్టులు వస్తుంటాయి. ఇప్పుడు తన కుమార్తె మొదటిసారిగా సినిమా సెట్ లో అడుగుపెట్టిన సందర్భాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. త్వరలోనే క్లింకార డాడీ అని పిలవాలని, ఆమె ఫోటోని చరణ్ పోస్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ ఫొటోలో ‘RC16’ సెట్ చూస్తుంటే, జాతర ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu hyderabad Latest News in Telugu live news Paper Telugu News ram charan ram charan daughter Telugu News online Telugu News Paper Telugu News Today Today news tollywood Trending vairal news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.