Varanasi movie : రాజమౌళి ‘వారణాసి’ జానర్ రహస్యం బహిర్గతం, అసలు ఏమిటి?

Read Time:  1 min
Varanasi movie
Varanasi movie
FONT SIZE
GET APP

Varanasi movie : దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేశ్ బాబు చిత్రం ‘వారణాసి’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సినిమా కథ, జానర్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ఆధారంగా ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు. సినిమా సైన్స్ ఫిక్షన్ ఫీల్ కలిగించినప్పటికీ, అసలు ఇది ఫాంటసీ–మైథలాజికల్ జానర్‌కు చెందినదని వెల్లడించారు.

Read also: Municipal Election Results: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం

Varanasi movie
Varanasi movie

‘ఆర్‌ఆర్‌ఆర్’ విజయంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నానని, ప్రతి చిత్రంతో కొత్త అనుభూతిని అందించడం తన లక్ష్యమని రాజమౌళి తెలిపారు. మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రలో వృషభంపై ఎంట్రీ ఇచ్చే సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి ఇస్తుందని చెప్పారు. సినిమా నిడివి మూడు గంటలకు తగ్గేలా ఉండొచ్చని, ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని వివరించారు. ఇప్పటికే రామాయణ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, దానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు సవాలుగా ఉన్నాయని చెప్పారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.