OG Trailer : సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి ముందుగానే ట్రైలర్ విడుదల కాబోతుంది. ఇప్పటికే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ ట్రైలర్(OG Trailer) విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. తాజాగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్‌ను సెప్టెంబర్ 21 ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
“Death quota… confirm anta!” అంటూ సినిమా సాంగ్‌లోని లిరిక్‌ను ఉటంకిస్తూ ప్రొడక్షన్ టీమ్ సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ రెండు తుపాకులు పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనిపించారు.
గ్యాంగ్‌స్టర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర పాత్రలో ఎప్పుడూ చూడని లుక్‌తో కనిపించనున్నారు. ఎమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడిగా ఓమీ భౌ పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక అర్ల్ మోహన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, శామ్, హరిష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీని రవికే చంద్రన్, మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైన్‌ను ఏ.ఎస్. ప్రకాష్, సంగీతాన్ని థమన్ ఎస్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలతోనే సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. రాబోయే ట్రైలర్‌తో సినిమా డే-వన్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
Read also :