हिन्दी | Epaper

దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ రైడ్స్

Sudheer
దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ రైడ్స్

టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత ఆయనే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.

ఈ రెండు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేకపోయింది. డిజాస్టర్ అనే ముద్రను వేయించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ఈ సంక్రాంతి రేసులో హీరోగా నిలిచిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

వెంకీ – అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదేనా ?

వెంకీ – అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదేనా ?

మళ్లీ పెళ్లికి సిద్ధం అంటున్న నాగార్జున హీరోయిన్

మళ్లీ పెళ్లికి సిద్ధం అంటున్న నాగార్జున హీరోయిన్

విజయ్-రష్మిక పెళ్లి..కండిషన్స్ ఇవే !!

విజయ్-రష్మిక పెళ్లి..కండిషన్స్ ఇవే !!

📢 For Advertisement Booking: 98481 12870