📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

గేమ్ ఛేంజర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల

Author Icon By Sudheer
Updated: January 7, 2025 • 7:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా తాలూకా ప్రమోషన్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాపై విపరీతమైన బజ్ తీసుకురాగా..తాజాగా చిత్రంలోని మెలోడీ సాంగ్ విడుదలై మరింత ఆసక్తి పెంచింది. చిత్రంలోని ‘అరుగు మీద’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. తమన్, రోషిణి JKV పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. రామ్ చరణ్, అంజలిపై ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జరగండి, రా మచ్చా, నానా హైరానా సాంగ్స్ సూపర్ హిట్ గా నిలవగా.. తాజా మెలోడీ సైతం వాటితో జత కలిసింది. మరి ఈ సాంగ్ వెండితెరపై ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఇక శంకర్ గత చిత్రాల్లో ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ సినిమాలు సామాజిక నేపథ్యం, అవినీతి కథాంశాలుగా తెరకెక్కాయి. తాజాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సైతం అదే తరహాలో రూపుదిద్దుకున్నట్లుగా అభిమానులు అంచనా వేస్తున్నారు. శంకర్ తన గత చిత్రాల్లో కథానాయకుడి పాత్రలు ఎంతో భిన్నంగా తీర్చిదిద్దారు. ఒక్కరోజు సీఎం అవకాశమిస్తే రాష్ట్ర భవిష్యత్ మార్చేసిన హీరోను ఒకే ఒక్కడులో చూశాం. తెగిపోయిన బ్రేక్ వైరు పట్టుకుని అపరిచితుడిని మేల్కొల్పి అవినీతి నేతలపై జరిపిన పోరాటాల్నీ తెరపై ఆస్వాదించాం. జెంటిల్​మెన్, భారతీయుడు, శివాజీ చిత్రాల్లోనూ అవినీతి నేతలు, అక్రమాలే కథా వస్తువులు.

గేమ్ ఛేంజర్ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ప్రభుత్వ అధికారికి మధ్య జరిగే ఘర్షణగా తెలుస్తోంది. “కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే పెద్దగా దానికొచ్చే నష్టమేమీ లేదు.. కానీ అది లక్ష చీమలకు ఆహారం అనే డైలాగ్ తోపాటు “నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్” అనే మరో డైలాగ్ అవినీతి రాజకీయ నేతపై జరిపే పోరాటాన్ని గుర్తు తెస్తోందంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. మరి వారు అనుకున్నట్లు సినిమా ఉంటుందా..? లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది.

Arugu Meedha Arugu Meedha song Game Changer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.