Movie News: ప్రభాస్ పై కృష్టవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

prabhas

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏమనగా టాలీవుడ్ ప్రభాస్‌ను సరిగా వినియోగించుకోవడం లేదని ఖడ్గం రీ-రిలీజ్ సందర్భంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఈ విషయాన్ని పంచుకున్నారు ఆయన ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ ఆయన అత్యంత ప్రతిభావంతమైన నటుడని తన పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు అయితే టాలీవుడ్‌లో ఆయన టాలెంట్‌ని పూర్తిగా వినియోగించడం లేదని ముఖ్యంగా ఆయన్ను యాక్షన్ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని తెలిపారు.

కృష్ణవంశీ తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చక్రం సినిమా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని తెలిపారు అదే సమయంలో మరో యాక్షన్ కథ కూడా ప్రభాస్‌కు వినిపించగా ప్రభాస్ సర్ అందరూ యాక్షన్ కథలే చెబుతున్నారు అని అన్నారు దీంతో ఆయన చక్రం కథను ఎంచుకున్నారని చెప్పిన కృష్ణవంశీ ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదని అభిప్రాయపడ్డారు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రభాస్‌ను యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారని, ఆయన వాస్తవమైన నటనను చూపించే అవకాశాలు దర్శకులు ఇవ్వట్లేదని వ్యాఖ్యానించారు.

ఇంకా కృష్ణవంశీ గతంలో ప్రభాస్‌కు వినిపించిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా చేయవచ్చని తెలిపారు కానీ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారని ఆయనకు సమయం దొరక్కపోవడం వల్ల సినిమా రూపుదిద్దకపోవచ్చని అన్నారు ఆయన తన ఇంటర్వ్యూలో ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి నా సినిమా చేయండి అని ప్రభాస్‌కు చెప్పలేను కదా అని వ్యంగ్యంగా చెప్పారు ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి కృష్ణవంశీ వ్యాఖ్యలు ఒకరకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో గల పెద్ద సవాలును చూపిస్తున్నాయి ప్రభాస్ వంటి ప్రతిభాశాలి నటుడు యాక్షన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న కథా చిత్రాలలో నటించే అవకాశం పొందితే ఆయన నటనకు మరింత గౌరవం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Latest sport news. ©2023 brilliant hub.