త్వరలో మోడీ పదవీ విరమణ..సంజయ్ రౌత్

Sanjay Raut: త్వరలో మోడీ పదవీ విరమణ..సంజయ్ రౌత్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దాదాపు 10 సంవత్సరాల తర్వాత సోమవారం రోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రధాని మోదీ పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నారని.. ఆ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు చెప్పేందుకే అక్కడకు వెళ్లారని తెలిపారు. సెప్టెంబర్ నెలలోనే ప్రధాని పదవిని వీడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయన రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచి వస్తారని వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

Advertisements
త్వరలో మోడీ పదవీ విరమణ..సంజయ్ రౌత్

11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మోడీ
భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లలేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత అంటే ఆదివారం రోజు నాగ్‌పుర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా డా.హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. ఆపై సంస్థ వ్యవస్థాపకుడు డా.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్ చాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్మృతి భవన్‌లో ఆర్ఎస్ఎస్ అధికారులు అందరితో కలిసి సమావేశం అయ్యారు. ఆపై ఫొటోలు కూడా దిగి సందడి చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కూడా కలిసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
దేశ నాయకత్వంలో మార్పును కోరుకున్న ఆర్ఎస్ఎస్
ఇదంతా ఇలా ఉడంగా.. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అలాగే కొత్త బీజేపీ చీఫ్‌ను ఎన్నుకోవాలనుకుంటున్నారని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సంస్థ నియమాల ప్రకారం ప్రధాని మోదీ కూడా రాజకీయాలకు పదవీ విరమణ ప్రకటించాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి..
అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి రిటైర్మెంట్ పత్రాన్ని సమర్పించేందుకే అక్కడికి వెళ్లుంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాకుండా ప్రధాన మోదీ రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తారని తాను గట్టిగా నమ్ముతున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
మోదీ ఇప్పుడే పదవీ విరమణ చేసే అవకాశం లేదని.. ఆయన నాయకత్వంలో తామింకా చాలా ఏళ్ల పని చేస్తామని వివరించారు. ఇప్పుడు మాత్రమే కాదని వచ్చే ప్రధాన మంత్రి ఎన్నికల్లో కూడా మోదీయే విజయం సాధించి.. 5 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు అందిస్తారని అన్నారు.

Related Posts
TGPSC : తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి
Obstacle removed for Telangana Group 1 recruitments

TGPSC : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్​ చేస్తూ గ్రూప్​-1 అభ్యర్థులు Read more

ఫిల్మ్ ఛాంబర్ పై కోర్టుకెక్కిన జానీ మాస్టర్
ఫిల్మ్ ఛాంబర్ పై కోర్టుకెక్కిన జానీ మాస్టర్

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఛాంబర్ Read more

Rajeev Yuva Vikasam : ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు
Rajeev Yuva Vikasam ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొంత నిరాశను మిగులుస్తోంది. ఈ పథకం ద్వారా స్వయం Read more

విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి : మంత్రి నిర్మలా సీతారామన్‌
Efforts to restore Visakhapatnam Steel to its former glory.. Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లారని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×