हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Mint Leaves Benifits: ఉదయాన్నే పుదీనా ఆకుల‌ను తింటే ఎన్నోలాభాలు

Sudha
Mint Leaves Benifits: ఉదయాన్నే పుదీనా ఆకుల‌ను తింటే ఎన్నోలాభాలు

పుదీనా ఆకులు (Mint Leaves Benifits) ప్రాచీన ఆయుర్వేదంలోను, ఆధునిక వైద్యంలోను ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపున పుదీనా ఆకులు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పుదీనా ఆకులు(Mint Leaves Benifits) ఎంతో రుచిగా, చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే వీటిని వంటల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని వాస‌న వ‌స్తుంది. అవి రుచిగా కూడా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం పుదీనా ఎన్నో అద్భుత‌మైన గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీ (Preparation of medicines)లో ఉప‌యోగిస్తారు. పుదీనా ఆకుల‌(Mint Leaves Benifits)ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు అనేక వ్యాధుల‌ను త‌గ్గిస్తాయ‌ని వారు అంటున్నారు. పుదీనా ఆకులు జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. రోజూ ఉద‌యం ప‌రగ‌డుపునే ఈ ఆకుల‌ను తింటే జీర్ణాశ‌య ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి. దీని వ‌ల్ల ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్తి త‌గ్గుతుంది. అలాగే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, క‌డుపు నొప్పి, వికారం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

 Mint Leaves Benifits: ఉదయాన్నే పుదీనా ఆకుల‌ను తింటే  ఎన్నోలాభాలు
Mint Leaves Benifits: ఉదయాన్నే పుదీనా ఆకుల‌ను తింటే ఎన్నోలాభాలు

నోరు ఆరోగ్యంగా..
పుదీనా ఆకుల్లో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. పుదీనా ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోరు ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా ఆకుల‌ను ఉద‌యం తింటే శ‌రీర మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. ఇది క్యాల‌రీలు ఖ‌ర్చయ్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఇది కూడా బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. పుదీనా ఆకుల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన డై యురెటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఖాళీ క‌డుపుతో ఈ ఆకుల‌ను తింటే శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా లివ‌ర్‌, కిడ్నీలు క్లీన్ అవుతాయి. ఆయా భాగాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.
శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది
పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన డికంజెస్టెంట్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిపోతుంది. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ్వాస‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. గాలి స‌రిగ్గా ల‌భిస్తుంది. అలాగే ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా, బ్రాంకైటిస్ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పుదీనాను తీసుకోవ‌డం వ‌ల్ల దాని వాస‌న‌కు, అందులో ఉండే సమ్మేళ‌నాల‌కు ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మూడ్ బాగుంటుంది. రాత్రి పూట నిద్ర కూడా చ‌క్క‌గా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

 Mint Leaves Benifits: ఉదయాన్నే పుదీనా ఆకుల‌ను తింటే  ఎన్నోలాభాలు
Mint Leaves Benifits: ఉదయాన్నే పుదీనా ఆకుల‌ను తింటే ఎన్నోలాభాలు

వాపులు త‌గ్గుతాయి
పుదీనాలో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు, రోజ్‌మ‌రినిక్ యాసిడ్‌, ఫ్లేవ‌నాయిడ్స్‌, విట‌మిన్ సి ఉంటాయి. ఇవ‌న్నీ ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు త‌గ్గుతాయి. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ స‌మ్మేళ‌నాలు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చ‌ర్మంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీని వ‌ల్ల మొటిమ‌లు, మచ్చ‌లు, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారి య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది. పుదీనా ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే 5 నుంచి 7 న‌మిలి తినాలి. లేదా ఈ ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను కూడా తాగ‌వ‌చ్చు. ఈ విధంగా పుదీనా ఆకుల‌ను తీసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also:hindi.vaartha.com

Read Also:Hair Tips: కరివేపాకుతో జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం!

శరీరం డిటాక్స్ అవుతుందా?

పుదీనా ఆకులు శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. దీనివల్ల శక్తివంతమైన డిటాక్స్ ఎఫెక్ట్ కలుగుతుంది.

స్ట్రెస్‌ను తగ్గిస్తుందా?

పుదీనాలో ఉండే సహజ పదార్థాలు మనస్సుకు ఆరాం కలిగించేలా పనిచేస్తాయి. టెన్షన్, ఉక్కిరిబిక్కిరి వంటి పరిస్థితులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ మెరుగుపరుచుకోవచ్చా?

పుదీనా ఆకులలో ఉండే సహజ నూనెలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్ణం, వాయువు, మలబద్ధకాలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870