हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Markram: సచిన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిన మార్కరమ్‌

Anusha
Markram: సచిన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిన మార్కరమ్‌

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఐడెన్ మార్క్రమ్ (Markram) అద్భుతమైన 136 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ సెంచరీతో మార్క్రమ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 27 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ, ఈ రికార్డు బ్రేక్ కావడం విశేషం.2025 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన మార్క్రమ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఫైనల్‌లో

ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో మార్క్రమ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. యాదృచ్ఛికంగా 27 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు బద్దలైంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ రావడం, 27 ఏళ్ల తర్వాత ఈ రికార్డు బ్రేక్‌ కావడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో మార్క్రామ్ చేసిన 136 పరుగుల ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంతకు ముందు ఈ రికార్డు 1998లో షార్జా కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 134 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సెంచరీ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు మార్క్రమ్ తన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాపై కొత్త రికార్డు సృష్టించాడు.

Markram: సచిన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిన మార్కరమ్‌
Markram

మొదటి ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే, ఈ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది, దీనికి ప్రతిస్పందనగా దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.WTC ఫైనల్‌లో సెంచరీ చేయడం ద్వారా, మార్క్‌రామ్ ICC టోర్నమెంట్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మార్క్‌రామ్ టెస్ట్ గణాంకాల ప్రకారం అతను 46 మ్యాచ్‌ల్లో 36.50 సగటు, 59.66 స్ట్రైక్ రేట్‌తో 2993 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read Also: Mitchell Johnson: ఆసీస్ ఆటగాళ్లపై మిచెల్ జాన్సన్ ఫైర్..కారణమేంటంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870