Lok Sabha passes Waqf Amendment Bill

Waqf Bill : వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Waqf Bill: సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ దద్దరిల్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

Advertisements
 వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ

అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు

బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్‌సభ భేటీ కొనసాగడం ఇదే మొదటిసారి. కాగా, ఈ బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే) లోక్ జనశక్తి పార్టీ ( రామ్ విలాస్) మద్దతిచ్చారు. మరో వైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి.

ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు

తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిల్లు పేపర్లను చించివేశారు. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. అయితే.. వక్ఫ్ భూముల పరిరక్షణ, పరిపాలనను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అక్రమ ఆక్రమణలు, అవినీతిని నివారించేందుకు కొత్త నిబంధనలు, వక్ఫ్ బోర్డు అధికారాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వివాదాస్పద భూముల పరిష్కరానికి సమర్థవంతమైన విధానాలు ఈ బిల్లు సూచిస్తుందని తెలిపింది.

Related Posts
దుర్గమ్మ దసరా ఉత్సవాల ఆదాయం రూ.9.26 కోట్లు
durgamma vjd

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి భారీ ఆదాయం లభించింది. మహా మండపంలో మూడు విడతల్లో భక్తులు సమర్పించిన Read more

ట్రంప్ 2024: 27 ఏళ్ల కరోలిన్ లీవిట్ ను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు
Karoline Leavitt

డొనాల్డ్ ట్రంప్ తన 2024 ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన ప్రభుత్వంలో కీలకమైన పదవులలో కొత్త నియామకాలు చేస్తున్నారు. తాజాగా, ట్రంప్ 27 ఏళ్ల  కరోలిన్ లీవిట్ Read more

Crime News :క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త
క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. పోస్టుమార్టంలో అసలు సగతి బయటపడటంతో నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ Read more

ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం
10 Labourers Killed In Truc

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×