kcr and revanthreddy

స్థానిక సంస్థల ఎన్నికలు కేసీఆర్ అలర్ట్ ….

ప్రజల్లో తన బలం నిరూపించుకునేందుకు రేవంత్ స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్దం అవుతున్నారు. కుల గణన పూర్తి చేయటం తమ భారీ సక్సెస్ గా ప్రభుత్వం భావిస్తోంది. ఆర్దికంగా కష్టాలు ఉ న్నా..రుణమాఫీ, రైతు భరోసా వంటి వాటి అమలు ద్వారా ప్రజల్లో సానుకూలత పెరిగిందనే అంచ నాతో ఉంది. ఇదే సమయంలో రేవంత్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష నేత లు వాదిస్తున్నారు. దీంతో, ప్రజల్లో తన బలం నిరూపించుకునేందుకు రేవంత్ స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్దం అవుతున్నారు. కేసీఆర్ తాజా పరిణామాలతో అలర్ట్ అయ్యారు.స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్దం అవుతోంది. షెడ్యూల్ విడుదల దిశగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10న బీసీ రిజర్వేషన్ల పై డెడికేటెడ్ కమీషన్ నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే బీసీ, ఇతర రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్ పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నా యి. రెండు విడతల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పరీక్షలు పరిగణలోకి తీసుకొని మార్చి 17, 18 లోగా ఎన్నికల పూర్తి చేసేలా షెడ్యూల్ ఉంటుందని భావిస్తున్నారు.

Advertisements
Rao and Reddy 696x392

ప్రస్తుతం కొనసాగుతున్న భిన్నమైన రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ స్థానిక ఎన్నికల నిర్ణయం సాహసంగా కనిపిస్తోంది. ఈ నెల 24, మార్చి 3..10వ తేదీల్లో ఎన్నికల తేదీలుగా ప్రచా రం సాగుతోంది. ఎన్నిక నిమిత్తం సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 570 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా వెల్లడికి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాను 15న విడుదల కానుంది. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రేవంత్ ఢిల్లీ పర్యటనలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం పైన హైకమాండ్ తో చర్చించారు. కుల గణనతో పాటుగా హామీల అమలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో అటు ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాదిస్తున్నాయి. ఈ సమయంలో రేవంత్ ఎన్నికలకు సిద్దం అవ్వటంతో అటు బీఆర్ఎస్ అప్రమత్తం అయ్యింది . రేవంత్ తో పాటుగా బీఆర్ఎస్, బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. రానున్న రోజుల్లో స్థానిక సమరం తెలంగాణలో రాజకీయంగా మరింత ఉత్కంఠగా మారుతోంది.

Related Posts
11 ఏళ్ల నాటి ఫొటోను షేర్ చేసిన హరీష్ రావు..!
Harish Rao shared a photo of 11 years.

తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత హైదరాబాద్‌: తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉన్నది. 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్ సభ Read more

శివయ్య మొక్కు కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
శివయ్య మొక్కు కోసం భారీగా తరలివచ్చిన భక్తులు

మహా శివరాత్రి వేడుకలు: శైవ క్షేత్రాలలో విశేష భక్తిపూర్వక సందడులు మహా శివరాత్రి ఆధ్యాత్మికంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగగా మరపురాని గొప్పతనం కలిగి ఉంటుంది. ఈ Read more

Abhishek Mahanti : అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట
Abhishek Mahanti

తెలంగాణలో సేవలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని డీపీఓటీ (DOPT) ఉత్తర్వులు Read more

ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీతెలంగాణ ప్రభుత్వం గురువారం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చిన్నపాటి పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి Read more

×