kcr and revanthreddy

స్థానిక సంస్థల ఎన్నికలు కేసీఆర్ అలర్ట్ ….

ప్రజల్లో తన బలం నిరూపించుకునేందుకు రేవంత్ స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్దం అవుతున్నారు. కుల గణన పూర్తి చేయటం తమ భారీ సక్సెస్ గా ప్రభుత్వం భావిస్తోంది. ఆర్దికంగా కష్టాలు ఉ న్నా..రుణమాఫీ, రైతు భరోసా వంటి వాటి అమలు ద్వారా ప్రజల్లో సానుకూలత పెరిగిందనే అంచ నాతో ఉంది. ఇదే సమయంలో రేవంత్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష నేత లు వాదిస్తున్నారు. దీంతో, ప్రజల్లో తన బలం నిరూపించుకునేందుకు రేవంత్ స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్దం అవుతున్నారు. కేసీఆర్ తాజా పరిణామాలతో అలర్ట్ అయ్యారు.స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్దం అవుతోంది. షెడ్యూల్ విడుదల దిశగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10న బీసీ రిజర్వేషన్ల పై డెడికేటెడ్ కమీషన్ నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే బీసీ, ఇతర రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్ పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నా యి. రెండు విడతల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పరీక్షలు పరిగణలోకి తీసుకొని మార్చి 17, 18 లోగా ఎన్నికల పూర్తి చేసేలా షెడ్యూల్ ఉంటుందని భావిస్తున్నారు.

Rao and Reddy 696x392

ప్రస్తుతం కొనసాగుతున్న భిన్నమైన రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ స్థానిక ఎన్నికల నిర్ణయం సాహసంగా కనిపిస్తోంది. ఈ నెల 24, మార్చి 3..10వ తేదీల్లో ఎన్నికల తేదీలుగా ప్రచా రం సాగుతోంది. ఎన్నిక నిమిత్తం సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 570 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా వెల్లడికి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాను 15న విడుదల కానుంది. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రేవంత్ ఢిల్లీ పర్యటనలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం పైన హైకమాండ్ తో చర్చించారు. కుల గణనతో పాటుగా హామీల అమలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో అటు ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాదిస్తున్నాయి. ఈ సమయంలో రేవంత్ ఎన్నికలకు సిద్దం అవ్వటంతో అటు బీఆర్ఎస్ అప్రమత్తం అయ్యింది . రేవంత్ తో పాటుగా బీఆర్ఎస్, బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. రానున్న రోజుల్లో స్థానిక సమరం తెలంగాణలో రాజకీయంగా మరింత ఉత్కంఠగా మారుతోంది.

Related Posts
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్.. !
BRS leader Errolla Srinivas arrested.

హైదరాబాద్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కేసు Read more

హుజురాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్
హుజురాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్

BJP గురించి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల.కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. BRS ను నమ్మరు. ఇద్దరినీ చూశాం ఈసారి బీజేపీకి అవకాశం Read more

నేడు అకౌంట్లలో నగదు జమ
rythu bharosa telangana

నేటి నుంచి రాష్ట్రంలో విడతల వారీగా 'రైతు భరోసా', 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 Read more

హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ Read more