Small relief for AAP.. CM Atishi's win

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే: ఆతిశీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పార్టీ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ సహా కీలక నేతలైన మనీశ్‌ సిసోడియా, సత్యేంద్రజైన్‌, సౌరభ్‌ భరద్వాజ్‌ ఓటమి పాలయ్యారు. కీలక నేతల్లో సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందారు. కల్కాజీ స్థానం నుంచి ఆమె సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

Advertisements
image

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే అని.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. కానీ సెలబ్రేట్‌ చేసుకునే సమయం కాదు. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమాద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 23 స్థానాల్లో ఆప్‌ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.

Related Posts
Jagan : డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్…
Jagan డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో ఇవాళ పర్యటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఈ ప్రాంతంలో ఇటీవల దారుణంగా హత్యకు Read more

Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం
శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ఇప్పుడు భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది కానీ ఈ సారి అది మరింత ప్రత్యేకంగా మారింది. Read more

వామ్మో.. మేక ఖరీదు అన్ని లక్షలా..? ఏంటో అంత ప్రత్యేకం
Goat Kid Sold In 14 lakh Ru

ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని Read more

Sunita Williams : సునీత ఇప్పుడెలా ఉన్నారంటే !
sunita williams return back

సునీతా విలియమ్స్ కేవలం 8 రోజుల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉండాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె 286 రోజులు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. Read more

×