📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US-Israel Iran War LIVE: క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

Author Icon By Digital
Updated: March 3, 2026 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US-Israel Iran War LIVE: అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్‌పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మరణంపై వస్తున్న వార్తలు, ఇరాన్ ప్రతిఘాత చర్యలు, గల్ఫ్ దేశాల తాజా పరిణామాలు, ట్రంప్ హెచ్చరికలు మరియు అంతర్జాతీయ సమాజం స్పందనలతో మధ్యప్రాచ్యం పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఈ సంక్షోభానికి సంబంధించిన నిమిషానికో అప్‌డేట్‌ను మీకు అందించే ప్రత్యక్ష వార్తలు ఇక్కడ.

International news telugu International news today Iran Attack on Israel Iran Israel Breaking News Iran Israel Crisis Live Updates Iran missile attack Israel Air Strike Israel Attack on Iran Israel Iran Conflict Latest News Middle East tensions Middle East War Live US Iran Conflict 2026 US Israel Iran War LIVE US Israel Iran War Live Updates US Military Action Iran US vs Iran War News World War 3 News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైవ్ అప్‌డేట్స్

🔴 Live Coverage
01:12 PM (IST) • Mar 03

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాకిస్తాన్‌లో ఆందోళనలు

  • ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో నిరసనలు చెలరేగాయి.
  • లాహోర్‌లోని అమెరికా కాన్సులేట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
  • వందలాది మంది ఇరాన్ మద్దతుదారులు కాన్సులేట్ వైపు దూసుకెళ్లినట్లు సమాచారం.
  • కాన్సులేట్ ప్రధాన గేట్‌కు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది.
  • ఇస్లామాబాద్, పెషావర్ నగరాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
  • అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
  • పాకిస్తాన్‌లో ఉన్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది.
12:50 PM (IST) • Mar 03

అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం

  • ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది.
  • ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని చైనా ప్రకటించింది.
  • అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని చైనా కోరింది.
  • ఇరానియన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

Source:


12:27 PM (IST) • Mar 03

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహాయక చర్యలు

  • గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు చర్యలు చేపట్టారు.
  • అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సంబంధిత ఎంబసీలను సంప్రదించాలని సూచించారు.
  • కువైట్‌లో ఉన్న భారతీయులు +965-65501946 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
  • ఒమన్‌లో ఉన్నవారి కోసం +968-98282270, 80071234 నంబర్లు ఏర్పాటు చేశారు.
  • సౌదీ అరేబియాలోని భారతీయుల కోసం 00-966-11-4884697, 00-966-542126748, 8002471234 (టోల్-ఫ్రీ/వాట్సాప్) నంబర్లు అందుబాటులో ఉన్నాయి.
  • బహ్రెయిన్‌లోని భారతీయులు 00973-39418071 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
  • దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లో ఉన్నవారి కోసం 800-46342 (టోల్-ఫ్రీ), +971-543090571 నంబర్లు ఏర్పాటు చేశారు.
11:45 AM (IST) • Mar 03

ఇరాన్–ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్: ప్రత్యేక విమానాల్లో భారత్‌కు భారతీయులు

  • ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.
  • దుబాయ్ నుంచి రెండు ప్రత్యేక విమానాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
  • మహారాష్ట్ర సీఎం ఆదేశాలతో ప్రత్యేక విమానాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • UAEలోని ఫుజైరా విమానాశ్రయం నుంచి స్టార్ ఎయిర్ విమానాలు బయలుదేరనున్నాయి.
  • మధ్యాహ్నం 3:30 మరియు సాయంత్రం 4:30 గంటలకు టేకాఫ్ కానున్నాయి.
  • మొత్తం 164 మంది ప్రయాణికులతో ఈ రెండు విమానాలు ముంబై చేరుకోనున్నాయి.
  • సాయంత్రం 6:30 తర్వాత ముంబైలో ల్యాండ్ అయ్యే అవకాశముంది.
  • పుణేలోని ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌కు చెందిన 84 మంది విద్యార్థులు దుబాయ్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం.
11:25 AM (IST) • Mar 03

ఆరాంకోపై ఇరాన్ దాడి: ధ్వంసమైన రిఫైనరీ

  • సౌదీ అరేబియాలోని రస్ తనూరాలో ఉన్న ఆరాంకో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి జరిగినట్లు సమాచారం.
  • విధ్వంసానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
  • ఆయిల్ రిఫైనరీతో పాటు పలు కీలక ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
  • ఇరాన్ మిసైల్ మరియు డ్రోన్ దాడులతో పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం.
11:24 AM (IST) • Mar 03

బహ్రెయిన్‌లో చెలరేగిన అంతర్గత అల్లర్లు

  • యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
  • ఇరాన్‌కు అనుకూల విధానానికి మద్దతుగా షియా వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
  • ఇరాన్ దాడులను వ్యతిరేకిస్తున్న సున్నీ పాలక వర్గం కఠిన చర్యలు చేపట్టింది.
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై షియా వర్గం నిరసనలు వ్యక్తం చేసింది.
  • కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలపై చేతికందిన వస్తువులు విసిరిన ఘటనలు నమోదయ్యాయి.