हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Lavanya Tripathi : పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భారత మహిళ పై లావణ్య త్రిపాఠీ ఫైర్

Sudheer
Lavanya Tripathi : పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భారత మహిళ పై లావణ్య త్రిపాఠీ ఫైర్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఈ దాడిపై దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక నగరాల్లో విద్యార్థులు, యువతులు, సామాన్యులు ర్యాలీలు నిర్వహించి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు. “ఉగ్రవాదం నశించాలి”, “భారతమాతకి జై” అంటూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి అమర జవాన్లకు నివాళులు అర్పించారు. సోషల్ మీడియాలో కూడా #IndiaAgainstTerrorism, #PahalgamAttack వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Jammu : లోయలో పడ్డ CRPF జవాన్ల వాహనం

“నీవు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నావా?” అంటూ మహిళను నిలదీత

అయితే ఈ జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక యువతి చేసిన పని వివాదానికి దారి తీసింది. పాకిస్థాన్ జాతీయ జెండాలను కాళ్లతో తొక్కుతూ నిరసన తెలుపుతున్న సమయంలో, ఆ యువతి జెండాలను రోడ్డుపై నుంచి తొలగించి, అడ్డుకోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ప్రజలు ఆమెపై ప్రశ్నలు గుప్పించారు. “పాక్ జెండాని ఎందుకు తీసేసావు?”, “నీవు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నావా?” అంటూ నిలదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి రియాక్షన్

ఈ వీడియోపై నటి, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. “మన సైనికులు తమ ప్రాణాలతో దేశాన్ని రక్షిస్తుండగా, కొందరు దేశ ద్రోహి భావాలను ప్రోత్సహించడం బాధాకరం. ఇది దేశం లోపల నుండి శుద్ధి చేయాల్సిన సమయం” అంటూ ట్వీట్ చేశారు. లావణ్య పోస్ట్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. దేశం మీద ప్రేమ చూపించాల్సిన ఈ సమయంలో, పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతున్న ఘటనలు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఉదంతం జాతీయ ఐక్యత, జవాన్ల త్యాగాల విలువపై ప్రజలను మరింతగా ఆలోచనలో పడేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870