Siddipet Crime News: ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లి

Read Time:  1 min
Siddipet Crime News: ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లి
FONT SIZE
GET APP

Siddipet Crime News: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో భూ వివాదం కారణంగా అన్న వంగ బాల్ రెడ్డిని చెల్లెలు రేణుక హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 20న భూమి విషయమై మాట్లాడుకుందామని రేణుక పిలవడంతో బాల్ రెడ్డి రాజక్కపేటకు వెళ్లారు. అక్కడ రేణుక తన కుమారుడితో కలిసి బాల్ రెడ్డిని హత్య చేసినట్లు సమాచారం. హత్య అనంతరం రేణుక పోలీసులకు లొంగిపోగా, మృతుడి మేనల్లుడు సోనురెడ్డి పరారయ్యాడు.

Read Also: Chhattisgarh crime: వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

Siddipet Crime News: Sister kills brother for property
Siddipet Crime News: Sister kills brother for property

ఈ ఘటనతో గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో పలు ఆధారాలను సేకరించిన అనంతరం బాల్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. మొత్తంగా భూ వివాదంలో అన్నను చెల్లె చంపిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఈ ఘటనతో రాజక్కపేట, చెల్లాపూర్ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఏదైనా భూ సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా చంపుకోవడం మంచింది కాదు అని.. గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.