Job placement : నియామక ప్రక్రియ మరింత మెరుగుపడాలి

Follow Us: Google News Daily Hunt
Job placement
Job placement
FONT SIZE
GET APP

Job placement : ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రక్రియ లో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ కేలండర్ విడుదలతో ప్రభుత్వ ఉద్యోగార్థుల మోములో సంతోషం నెలకొన్నది. కొత్త జోనల్ వ్యవస్థ అమలుతో పాటు నియామక ప్రక్రి యలు త్వరితగతిన పూర్తి చేసేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభపరిణామం. గత అనుభవాల దృష్ట్యా నియామక ప్రక్రియలో కొన్ని సమూల మార్పులు, సంస్కరణలు చేయడం అత్యంత ఆవశ్యకం. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యానికి ప్రధాన కారణం కోర్టు కేసులేనని అనుకుంటుంటాము. కానీ వాటి నేపథ్యం గమనిస్తే ఎన్నో సాంకేతిక కారణాలే వాటికి కారణ మని తేటతెల్లమౌతోంది. గతంలో నియామక ప్రక్రియపై నమోదైన కేసుల సరళిని పరిశీలిస్తే ముఖ్యంగా ప్రశ్నా పత్రం లో తప్పులు,కీ’ లో తప్పుడు సమాధానాలకు మార్కులు ఇవ్వడం లాంటివి ప్రధానం. అధునాతన సాంకేతిక కాలంలో కూడా తర్జుమాలో తప్పులు దొర్లడం అసమర్థతకు నిదర్శనం. ఇవి పూర్తిగా నిరోధించగలిగే పొరపాట్లు.

Read Also : Delimitation india : లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంపు సంకేతం

Job placement
Job placement

Job placement : చిన్నపాటి పొరపాట్లు చివరికి నోటిఫికేషన్ రద్దయ్యే

2011 గ్రూప్1 కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ప్రధాన పరీక్ష రద్దు కాబడి మరల నిర్వహించడానికి మూల కారణం ‘కీ’ లో కూడా తప్పులు దొర్లడమే. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రం ‘కీ’ తయారీలో శ్రద్ధ వహిస్తే ఈ అంశంపై నమోదయ్యే కేసులు నివారించొచ్చు. అదే విధంగా రిజర్వేషన్ రోస్టర్ పద్ధతిలో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆయా శాఖాధిపతులు జాగరూకత తో ఉండాలి. వారు పంపే రోస్టర్సం ఖ్యల ఆధారంగానే కమిషన్ నోటిఫికేషన్ ఖాళీల వివరాలు పొందుపరుస్తుంది. ఈ అంశంలో కమిషన్ పాత్ర కన్నా ఆయా శాఖల పాత్ర కీలకం. వారు చేసి చిన్నపాటి పొరపాట్లు చివరికి నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితిలు వస్తాయి. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్ కోర్టులో నానుతుండడంతో ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది. ఇక్కడ అధికారులు చేసే పొరపాట్లు వలన ఏళ్ల తరబడి కష్టపడే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు పరీక్షల నిర్వహణలో ఏ చిన్నలోపం ఉన్నా కూడా నోటిఫి కేషన్కే ఎసరు వస్తుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబం ధనలు తూచా తప్పకుండా పాటిస్తూ మరో వైపు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలి. తెలంగాణ గ్రూప్1 దీనికి మంచి ఉదాహరణ. కేవలం బయోమెట్రిక్ తీసుకోలేదని తెలంగాణ హైకోర్టు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి ప్రస్తావించాలి. దాదాపు పదేళ్ల అయిన ప్పటికీ నోటిఫికేషన్ కి సంబంధించిన కేసు కోర్టులో పెం డింగ్లోనే ఉంది.

ఆన్లైన్లో నిర్వహణ సాధ్యం కాదు

ఎస్సెస్సీ, బ్యాంకింగ్ పరీక్షలతో పోల్చు కుంటే గ్రూప్ పరీక్షల ఆద్యంతాల గురించి చెప్పలేని పరి స్థితి. కమిషన్ ముందుగానే తాత్కాలిక తేదీలు ప్రకటిస్తే అభ్యర్థుల్లో ఒక అంచనా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ సన్నద్ధం అయ్యేవారికి ఇది ఉపయక్తంగా ఉంటుంది. గ్రూప్ 2 పరీక్ష సైతం ఆన్లైన్లో నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. రాబోయే గ్రూప్2 ప్రాథమిక పరీక్షకు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్లో నిర్వహణ సాధ్యం కాదు. కాని ప్రధాన పరీక్షను ఆన్లైన్లో నిర్వహణకు ఆస్కారం కనపడుతోంది. ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షకు ఎంత మందిని అనుమతించాలనేది జీవో 5 ప్రకారం ప్రస్తుతం ఎపిపియస్సీ విచక్షణగా ఉంది. ఈ విచక్షణతో ఫలితాల వెల్లడికి ముందు కాకుండా నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఉపయోగించాలి. క్రితంసారి గ్రూప్ 1, 2లో ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో అభ్యర్థులు ఎక్కువ నిష్పత్తితో ప్రధాన పరీక్షకు అనుమతించాలని పెద్ద ఎత్తున అభ్యర్ధనలు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పున రావృతం కాకుండా ఉండాలి అంటే ముందుగానే నిష్పత్తి నిర్ణయించి అది కూడా కేవలం 1:15 మాత్రమే ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థుల్ని అనుమతించడం వలన ఎక్కువ కాలం పాటు ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండిపోయి మరేయితర పరీక్షల సన్నద్ధతకు వీలుండదు.ఎపిపియస్సి నిర్వహించే పరీక్షల్లో గ్రూప్ 1 మినహా ఇతర నియామక పరీక్షలకు ప్రధాన పరీక్ష పిదప సిపిటి పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆయా కమ్యూనిటీ పరంగా కనీస మార్కులు సాధిస్తేనే అంతిమ ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ ప్రధాన పరీక్షల్లో తీవ్ర మైన పోటీ తట్టుకుని అర్హత సాధించిన అభ్యర్థుల్ని కేవలం సిపిటిలో ఉత్తీర్ణత లేదని అభ్యర్థుల్ని పరిగణనలోకి తీసుకోన కపోవడం అనేది సహేతుకం కాదు. ఈ సిపిటి వలన సమ యం వృధాతప్ప ఎటువంటి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎంపిక కాబడిన అభ్యర్థి తన ప్రొబేషన్లో ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు సమకూర్చుకుంటారు.

Job placement
Job placement

తొలి అడుగు

మొన్న జరిగిన సిపిటి పరీక్ష విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. ప్రత్యేక సాఫ్ట్వేర్లో నిర్వహించకుండా కేవలం మొక్కుబడిగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన ఓఅభ్యర్థి సిపిటిలో ఉత్తీర్ణత లేదని ఎంపిక చేయకపోవడంతో సగటు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. అంతిమ ఫలితాల వెల్లడి లో ఎపిపియస్సి పారదర్శకత పాటించట్లేదు. సెలక్షన్ నోటి ఫికేషన్లో కేవలం ఎంపికయ్యే అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే పేర్కొనడం వలన పారదర్శకత లోపి స్తుంది. ఎంపికైన అభ్యర్థుల పేరు, మార్కులు, కమ్యూనిటీ, లింగం, ప్రాంతంమొదలగు కనీస వివరాలు పేర్కొనాలి. సామాజిక తనిఖీకి ఇవి అత్యవసరం. కేవలం అడ్మిట్ కార్డ్ నెంబర్ పేర్కొనడం వలన ఫలితాల నమోదులో సంభవించే చిన్నపాటి పొరపాట్ల వలన అభ్యర్థుల భవిష్యత్తు తలకిందు లు అవుతుంది. అదేవిధంగా ఎంపికయ్యే అభ్యర్థుల ఓఎమ్మా ర్ కాపీ అందరికి అందుబాటులో ఉండాలి. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం ఈ పద్ధతి అవలంబిస్తోంది. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ప్రధాన పరీక్షల ఫలితాల విడుదల రోజునే విడుదల చేయాలి. ప్రస్తుతం ఎపిపియస్సీ మార్కుల విడుదలతో మీనమేషాలు లెక్కిస్తోంది. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయన్న కారణంతో మార్కు లు వెల్లడించట్లేదు. ఇలాంటి కారణాలు అసంబద్ధం. అభ్యర్థి తన మార్కులతోపాటు ఎంపికైన అభ్యర్థుల మార్కులు తెలు సుకోవడం పారదర్శకతలో భాగం అని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో తేల్చిచెప్పింది. జాబ్ కేలండర్ అనేది తొలి అడుగు మాత్రమే. నోటిఫికేషన్ విడుదల మొదలు. అంతిమ ఫలితాల వెల్లడి నియామకపత్రాల జారీవరకు అడ్డంకిలేకుండా వేగంగా పూర్తి కావాలంటే అంటే సమూల మార్పులు అవసరం.


-జి. వి. సాయికుమార్ గుంత

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు