గత ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాలు భారతీయ మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానం కింద ఆదాయపు పన్ను స్లాబ్‌లలో చేసిన మార్పులు, రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం వంటి నిర్ణయాలు లక్షలాది మందికి ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2026(Budget 2026) పై పన్ను చెల్లింపుదారుల అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి కూడా ఆదాయపు పన్నులో మరో ఊరట ఉంటుందా? అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
Read Also: Medigadda Barrage : ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ – కేంద్రం రెడ్ అలర్ట్

TDS నిబంధనలు, ప్రామాణిక మినహాయింపు
అయితే పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. Budget 2026 లో భారీ ఆదాయపు పన్ను కోతలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. గత బడ్జెట్‌లోనే సమగ్ర పన్ను సంస్కరణలు చేపట్టినందున, ఈసారి ప్రభుత్వం పన్ను వ్యవస్థను మరింత హేతుబద్ధీకరించడంపై, చిన్న కానీ ప్రయోజనకరమైన మార్పులపై దృష్టి సారించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా TDS నిబంధనలు, ప్రామాణిక మినహాయింపు (Standard Deduction) వంటి అంశాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ వెల్త్ సంస్థ COO నావల్ కగల్‌వాలా మాట్లాడుతూ.. 8వ వేతన సంఘం అమలు FY28లో ఉండటంతో ప్రభుత్వానికి ఆర్థిక పరంగా పరిమితి ఉంటుందని తెలిపారు. అందుకే బడ్జెట్ 2026లో వ్యక్తిగత ఆదాయపు పన్నులో పెద్ద మార్పులు ఆశించడం కష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు.
రూ. 1 లక్షకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్
ఈ నేపథ్యంలో, కేవలం NPSకే కాకుండా ఇతర పొదుపు పథకాలకు కూడా మినహాయింపులు విస్తరించాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక జీతం పొందే ఉద్యోగుల విషయానికి వస్తే.. ప్రామాణిక మినహాయింపు పెంపుపై భారీ ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం పాత పన్ను విధానంలో ఇది రూ. 75,000 కాగా, కొత్త పన్ను విధానంలో రూ.50,000 మాత్రమే ఉంది. దీనిని రూ. 1 లక్షకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఫిన్నోవేట్ CEO నేహల్ మోటా ప్రకారం.. ప్రామాణిక మినహాయింపు పెంపు పెరుగుతున్న జీవన వ్యయాలను ఎదుర్కోవడంలో జీతం పొందే వర్గానికి గణనీయమైన ఉపశమనం ఇస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: