Hydrogen Train : హైడ్రోజన్ రైలు రయ్ రయ్..!

Follow Us: Google News Daily Hunt
Hydrogen Train : హైడ్రోజన్ రైలు రయ్ రయ్..!
FONT SIZE
GET APP

Hydrogen Train : భారతీయ రైల్వేలో గ్రీన్ మొబిలిటీకి మరో కీలక ముందడుగు పడింది. హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో నడుస్తున్న దేశపు తొలి హైడ్రోజన్‌ ఆధారిత ప్రయాణికుల రైలు వేగ పరీక్షల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓ సతీష్ కుమార్ తాజాగా Hydrogen Trainవెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రైలుతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రయాణికుల సేవల్లో గరిష్ఠంగా 75 కిమీ వేగంతో నడుపుతున్నప్పటికీ, భవిష్యత్‌లో 110 కిమీ వేగంతో ఆపరేట్ చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.

Read Also : SBI సేవలకు అంతరాయం

పది కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు :

ఈ హైడ్రోజన్ రైలు 2026 జూలై 17న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జింద్‌లో ప్రారంభమైంది. సుమారు 89 కిలోమీటర్ల జింద్–గోహానా–సోనిపట్ మార్గంలో ఇది సేవలు అందిస్తోంది. పది కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ద్వారా రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ప్రధాన ఉద్గారం నీటి ఆవిరి కావడం దీని ప్రత్యేకత.

Hydrogen Train

ఇక రైలు వేగం మాత్రమే కాదు.. దీని పర్యావరణ ప్రయోజనాలు కూడా కీలకంగా మారాయి. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ రైలు 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, 3,200 లీటర్లకు పైగా డీజిల్ వినియోగాన్ని ఆదా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం రైల్వే అధికారులు తదుపరి దశలో ఏ మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టవచ్చనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం మార్గాల సాంకేతిక పరిస్థితులతో పాటు హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రీఫ్యూయలింగ్ మౌలిక వసతులు కూడా పరిశీలిస్తున్నారు. 120 కిమీ వేగ పరీక్ష విజయవంతం కావడం భారత రైల్వేలో హైడ్రోజన్ ఆధారిత, తక్కువ కాలుష్య రవాణాకు కొత్త అవకాశాలను తెరుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Ramesh

రచయిత గురించి

Ramesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు