Bhupalpally : భూపాలపల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై అఘాయిత్యం!

Read Time:  1 min
Bhupalpally
Bhupalpally
FONT SIZE
GET APP

Bhupalpally : కామానికి లోనై మనుష్యతను కోల్పోయిన కొందరు మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. ఎదుట ఉన్నది చిన్నారేనా? అన్న కనీస ఆలోచన లేకుండా నేరాలకు దిగుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేగొండ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఘటన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు యువకులు చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు వెంటనే భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Read Also: Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్

Bhupalpally
Bhupalpally

ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు స్థానికులా? లేక బయటి వ్యక్తులా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఈ దారుణ ఘటనపై గ్రామస్తులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.