కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) పనుల్లో వేగం పెరిగింది. వేతన సంఘం ముందు తమ అభ్యర్థనలను, అభిప్రాయాలను సమర్పించే గడువును ఇప్పుడు మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ గడువు మార్చి 16 వరకు మాత్రమే ఉండగా, వివిధ ఉద్యోగ సంఘాల విన్నపం మేరకు దీనిని నెలాఖరు వరకు పొడిగించారు. గడువు పెంపు వెనుక కారణం ఏంటి? 8వ వేతన సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో 18 పాయింట్లతో కూడిన ఒక సుదీర్ఘ ప్రశ్నావళిని (Questionnaire) విడుదల చేసింది. ఈ ప్రశ్నలు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (Allowances) , పని పరిస్థితులకు సంబంధించినవి. ఈ ప్రశ్నావళికి ఇచ్చే సమాధానాలే భవిష్యత్తులో ఉద్యోగుల జీతాల పెరుగుదలను నిర్ణయిస్తాయి. అందుకే దీనిపై లోతుగా చర్చించి సరైన అభిప్రాయాలను అందించడానికి మరికొంత సమయం కావాలని ఉద్యోగుల సంఘాలు కోరడంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Iran Warns Gulf Countries: గల్ఫ్ దేశాలకు ఇరాన్ భీకర హెచ్చరిక!

భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన.. ప్రశ్నావళిలో ఏముంది?
8th Pay Commission అడిగిన 18 ప్రశ్నలు చాలా కీలకమైనవి. అవేంటంటే.. ప్రస్తుత జీతాల నిర్మాణం (Salary Structure) లో మార్పులు కావాలా? ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా అలవెన్సులను ఎలా పెంచాలి? పెన్షనర్లకు అందుతున్న ప్రయోజనాలు సరిపోతున్నాయా? ఉద్యోగుల పనితీరును బట్టి ప్రోత్సాహకాలు ఎలా ఉండాలి? ఇటువంటి అంశాలపై నేరుగా ఉద్యోగులు, పెన్షనర్లు, యూనియన్లు , సామాన్య ప్రజల నుండి కూడా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. 8వ వేతన సంఘం అంటే ఏమిటి? ఎవరు సభ్యులు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సమీక్షించడానికి ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రభుత్వం వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 8th Pay Commission కు జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ పులక్ ఘోష్ , మెంబర్ సెక్రటరీ పంకజ్ జైన్ సభ్యులుగా ఉన్నారు. నవంబర్ 2025 లో ఈ కమిషన్ తన పనిని ప్రారంభించింది. వీరు తమ నివేదికను సమర్పించడానికి మొత్తం 18 నెలల సమయం ఉంది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :