हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ

Anusha
OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ

మ‌ల‌యాళం నుంచి వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సాధించిన మోహ‌న్ లాల్ ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేసింది.ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మంజు వారియ‌ర్, టోవినో థామస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మ‌రోవైపు వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్‌గా ఈ చిత్రం రూ.262 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్టింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌ లో నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషలలో ఈ సినిమాను విడుదల చేయగా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం దేశంలోనే రూ.121 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు.

కథ

ఎంపురాన్ కథ లూసిఫర్‌కి కొనసాగింపుగా మొదలవుతుంది. కనుక లూసిఫర్ చిత్రం చూసినవాళ్లకే ఇది కనెక్ట్ అవుతుంది. లూసిఫర్ సినిమాలో చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండానే డైరెక్టర్ వదిలేశారు. అందులో ముఖ్యమైనవి అసలు ఎవరీ స్టీఫెన్ నడుంపల్లి/ ఖురేషి అబ్రాం (మోహన్ లాల్), అసలు ఐయూఎఫ్ లీడర్ పీకే రామ్‌దాస్‌కి స్టీఫెన్‌కి లింకేంటి, జైద్ మసూద్ (పృథ్వీరాజ్) ఖురేషి అబ్రాం‌కి మధ్య కనెక్షన్ ఏంటి? ఇలాంటి చాలా ప్రశ్నలకి ఎంపురాన్ సినిమాలో సమాధానం దొరికింది.లూసిఫర్ క్లైమాక్స్‌లో కేరళ సీఎంగా జతిన్ రామ్‌దాస్ (టొవినో థామస్)ని ఎన్నిక అయ్యేలా చేసి స్టీఫెన్ అలియాస్ ఖురేషి అబ్రాం (మోహన్ లాల్) తన పాత జీవితంలోకి వెళ్ళిపోతాడు. ఇక ఎంపురాన్‌లో జతిన్ క్యారెక్టర్ పూర్తి నెగెటివ్‌గా మారుతుంది. సీఎంగా అధికారం రావడంతో జతిన్ అవినీతి కూపంలో మునిగిపోతాడు. కోట్ల రూపాయల్లో ముడుపులు తీసుకుంటాడు. నడుంపల్లిలోని ఒక చెక్ డాం నిర్మించేందుకు కోట్ల రూపాయలు జతిన్ లంచం తీసుకున్న విషయం తెలియడంతో అతని మీద సొంత ప్రభుత్వంలోనే అసమ్మతి పెరుగుతుంది.

విశ్లేషణ

ప్రియదర్శిని (మంజు వారియర్) కూడా తమ్ముడికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొంటుంది. దీంతో ఎవరూ ఊహించని నిర్ణయం ఒకటి జతిన్ తీసుకుంటాడు. రాష్ట్రంలో తన అవినీతి మరకల్ని సొంత పార్టీకి అంటించేసి తాను బయటికి వచ్చేందుకు కొత్త పార్టీ పెడతాడు. ఇక దీనికి కేంద్ర ప్రభుత్వం అండ కోసం బాబా బజరంగి (అభిమన్యు సింగ్) సమక్షంలో వాళ్ల పార్టీతో చేతులు కలిసి పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జతిన్ ప్రకటిస్తాడు. మరి పీకే రామ్‌దాస్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాడని నమ్మి సీఎం సీట్లో కూర్చోబెట్టిన జతిన్ ఇలా చేశాడని తెలిసి ఖురేషి ఏం చేశాడు? అసలు ఖురేషి దగ్గర జైద్ మసూద్( పృథ్వీరాజ్) ఎందుకు చేరాడు? జైద్ మసూద్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? బజరంగీకి- జైద్ మసూద్ కి ఉన్న సంబంధం ఏంటి? ఖురేషి అబ్రాం‌కి బయటి దేశాలతో ఉన్న లింకులేంటి అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also: Rajakaar Movie: దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎన్నికైన రజాకార్ మూవీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870