KTR condoles Mogilaiah death

మొగిలయ్య మృతిపట్ల కేటీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రముఖ జానపద కళాకారుడు బలగం మొగులయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాటకు చలించని హృదయం లేదన్నారు. పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని చెప్పారు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తుచేశారన్నారు. మొగులయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

‘నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది. మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది. మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, జానపద కళాకారుడు, ‘బలగం’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన మొగిలయ్య (67) ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన ఆయన ఇటీవల వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చేరగా, ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

Related Posts
యూజీ సిలబస్ ను సవరించిన టీజీసీహెచ్ఈ
యూజీ సిలబస్ ను సవరించిన టీజీసీహెచ్ఈ

రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిజిసిహెచ్ఇ) యుజి సిలబస్ను పునరుద్ధరించడం, ఇంటర్న్షిప్లను ప్రారంభించడం వంటి కీలక కార్యక్రమాలను ప్రకటించింది. Read more

పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రిమాండ్ విధించిన కోర్టు, ఆయనను రాజంపేట Read more

మళ్లీ అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తాం: కవిత హెచ్చరిక
BRS MLC Kavitha who toured Jangaon district

రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని మండిపాటు హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ Read more

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఐసెట్ 2025 పూర్తి షెడ్యూల్ విడుదల

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ Read more