ktr comments on congress

KTR: సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలే : కేటీఆర్‌

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అంటే పస్తులేనా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని కేటీఆర్‌ మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు.. సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలేదని విమర్శించారు. రైతుల నుంచి సన్నాలు కొన్నది లేదు, సన్నాలకు బోనస్ రూ.500 ధర ఇచ్చిందీ లేదన్నారు. మార్చి నుంచి పేదలకు సన్నబియ్యం అని ప్రకటనలు చేశారు.

Advertisements
సన్నబియ్యం కోసం చూస్తే

విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్

పదో తేదీ దాటినా పేదలకు రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. గురుకులాల్లో విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్ సర్కారు.. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకానాలకు లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి ఇందిరమ్మ ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని చెప్పారు. కొత్త ఏడాది ఉగాదికి సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం ఊడబీకారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే పస్తులేనా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అంటే కటింగ్

ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని నిలదీశారు. రైతులకు రుణమాఫీ కట్, రైతులకు రైతుభరోసా, రైతుబీమా, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్, గర్భవతులకు న్యూట్రిషన్ కిట్, విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్.. ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కూడా కట్ అని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కటింగ్ అని.. కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని చెప్పారు.

Related Posts
KTR : వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా : కేటీఆర్
KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

KTR : వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా : కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తాను పాదయాత్రకు సిద్ధమయ్యానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

కేంద్రం ప్యాకేజీ పై లోకేశ్ హర్షం
Lokesh responded to Visakhapatnam steel industry package

అమరావతి: విశాఖ ఉక్కుకు కేంద్రప్రభుత్వం రూ.11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈప్యాకేజీపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన Read more

రెండు రాష్ట్రాల్లో ఖాతా తెరువని ఆప్
Aam Aadmi Party will not op

జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డకౌట్ అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. హరియాణాలో Read more

SLBC ప్రమాదం – ఇంకా లభించని కార్మికుల ఆచూకీ
eight workers dies in slbc

తెలంగాణలోని (SLBC) సొరంగంలో జరిగిన ప్రమాదం అందరినీ కలవరపెడుతోంది. సొరంగంలో చేపట్టిన పనుల్లో భాగంగా అకస్మాత్తుగా లోపల మట్టిచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×