Konda Surekha defamation case should be a lesson. KTR key comments

కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Advertisements

ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు” అంటూ కేటీఆర్‌ హెచ్చరించారు.

రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Related Posts
దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదు – సీఎం రేవంత్
సీఎం రేవంత్ వ్యూహాత్మక అడుగులు – కొత్త రాజకీయ సమీకరణాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై తీవ్రంగా స్పందించారు. దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కేవలం Read more

మందుబాబుల చేత గడ్డి పీకించిన పోలీసులు
drink and drive

మంచిర్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 27 మంది పట్టుబడిన వారికీ కోర్ట్ వినూత్న తీర్పుఇచ్చింది. స్థానిక కోర్టు జడ్జి, వీరికి శిక్షగా వారం రోజులపాటు స్థానిక Read more

క్యాట్ కీలక తీర్పు..వారంతా ఏపీకి వెళ్లాల్సిందే
CAT Shock to IAS Officers

ఐఏఎస్‌(CAT)ల పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్‌(IAS)లకు షాక్ ఇస్తూ క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ Read more

ప్రశాంత్ కిశోర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..!
Minister Lokesh meet with Prashant Kishor.

న్యూఢిల్లీ: మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ కేంద్ర మంత్రిని కలవడానికి ముందుగానే లోకేష్ ను Read more

×