हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Kommineni Srinivasa Rao: సుప్రీం కోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట

Anusha
Kommineni Srinivasa Rao: సుప్రీం కోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట

సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట దక్కింది.కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం తెలిపింది. వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వ్యాఖ్యానించింది. డిబేట్‌లో కొమ్మినేని (Kommineni Srinivasa Rao) నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది.అలాగైతే కేసుల విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతుంటామని, విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదని అభిప్రాయపడింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించింది.

నోటీసు ఇవ్వకుండా

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారని,మూడేళ్లలోపు శిక్షపడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని కొమ్మినేని తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని,సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదన్నారు.డిబేట్‌లో గెస్ట్ (విశ్లేషకులు) చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని, అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కొమ్మినేని నియంత్రించారని, ఆయన ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదన్నారు. శ్రీనివాసరావును తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారన్నారు.

ప్రయత్నం

కొమ్మినేనిని ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదని ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎలాంటి నేర చరిత్ర లేదని లాయర్ కోర్టుకు తెలిపారు. శ్రీనివాసరావు 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్(Senior citizen) దర్యాప్తు నుండి తప్పించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున లాయర్‌ను అనుమతించలేదని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమన్నారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారని,

Kommineni Srinivasa Rao: సుప్రీం కోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట
Kommineni Srinivasa Rao

వాదనల్ని పరిగణలోకి

ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాక్ స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తున్నారని, అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కు(right to life)కు భంగం కలిగిందన్నారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొమ్మినేని విడుదలకు అనుమతించింది.అమరావతి మహిళల్ని కించపరిచేలా ఓ న్యూస్ ఛానల్‌ డిబేట్‌లో వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా విశ్లేషకుడు కృష్ణంరాజులపై కేసు నమోదైంది.

రిమాండ్

ఈ క్రమంలో ఈ నెల 9న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుంచి గుంటూరు(Guntur)కు తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే కొమ్మినేని తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా ఆయన్ను ధర్మాసనం విడుదల చేయాలని ఆదేశించింది.

Read Also: Vijay Rupani: విజయ్ రూపానీ మృతి ప‌ట్ల‌ సంతాపం వ్యక్తం చేసిన పవన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870