The Frog’s Cleverness:సుందరవనం అనే అడవిలోని ఒక మడుగులో ఒక కప్ప నివసించేది. ఒకసారి ఆ కప్ప ఆహారం కొరకు ఆ మడుగు నుండి బయటకు వచ్చింది. వెంటనే ఒక రాయి చాటుగా ఉన్న ఒక పాము దానిని తన నోటికి జరిపించుకుంది. అప్పుడు కప్ప ‘అయ్యో! నేను ఆ నీటిలో ఉన్నా బాగుండేది. ఆకలి ఎంత పని చేసింది? ఆ ఆకలి వల్లే నేను బయటకు వచ్చాను. ఆ పాముకు దొరికిపోయాను. ఈ పాము నన్ను తినక తప్పదు. ఇప్పుడు చివరి ప్రయత్నంగా ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను’ అని అనుకుంది. వెంటనే దానికి చటుక్కున ఒక ఉపాయం తోచింది.

అది పాముతో ‘ఓ సర్పమా! నీకు ఎలుకలు ఇష్టమా! కప్పలు ఇష్టమా!’ అని అడిగింది. అందుకు పాము ‘ఎలుకలు’ అని అంది. ‘మరి కప్పనైన నన్ను పట్టుకున్నావేమిటి?’ అని అడిగింది కప్ప. ‘నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం చేయాలి? నీవు సమయానికి దొరికావు. అందుకే నిన్ను పట్టుకున్నాను’ అని అంది పాము. ‘అయ్యో! పాపం నీకు ఇష్టమైన ఎలుకలు (Rats) దొరకలేదు కదూ! సరే! మరి నేను నీకు ఎలుక కన్నాన్ని చూపిస్తాను. నన్ను వదిలి పెడతావా!’ అని అడిగింది కప్ప. ‘సరే’ అంది పాము(snake).
ఆ కప్ప దారి చెబుతుంటే పాము ఆ ఎలుక కన్నం వద్దకు బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆ కప్ప పామును ఆపి, ‘అదిగో! అక్కడ ఆ కన్నంలో ఎలుక ఉంది చూడు!’ అని అంది. ‘అలాగే! అయితే అది దొరికితే నిన్ను వదిలిపెడతాను’ అంది పాము. ‘ఓ సర్పమా! నీవు ఆ కన్నంలోకి చూడు. నీకు ఎలుక కనబడుతుంది’ అంది కప్ప. ‘ఏదీ! నీవే నాకు అడ్డుపడుతున్నావు’ అంది పాము. ‘అందుకే నన్ను వదిలిపెట్టు. నేను ఎక్కడికి పోనులే! నీకు ఎలుక దొరికేంతవరకు నేను ఇక్కడ నీ దానిని పట్టిస్తాను’ అంది కప్ప. పాము దాని మాటలు నమ్మి కప్పను వదిలి దానిపై ఒక కన్ను వేసి ఉంది. పాము వదిలిపెట్టిన ఆ కప్ప అక్కడనే ఉంది. మాటిమాటికి ఆ పాము కప్పవంక చూస్తూనే ఉంది.

తర్వాత ఆ పాము కన్నంలో తొంగి చూడసాగింది. దానికి ఎలుక కనిపించలేదు. ‘అయ్యో! ఈ కన్నంలో ఎలుకలేదేమిటి’ అని అడిగింది పాము. అప్పుడు కప్ప ‘అలా కాదు. నీవు ఆ కన్నంలో నీ మూతిని మొత్తం పెట్టి చూడు’ అని అంది. పాము సరేనని తన మూతిని ఆ కన్నంలో పెట్టింది. ‘ఆ.. ఆ.. అలా.. ఇంకా లోపలికి నీ మూతిని చొప్పించి చూడు. అది ఎక్కడికి పోదులే! నీకు దొరికినట్టే!’ అని ఉత్సాహపరిచింది కప్ప. పాము సంతోషించి ఇంకా కొంచెం లోపలికి తన మూతిని పెట్టి చూసింది. అందులో కప్ప చెప్పినట్టు దానికి ఒక ఎలుక కనిపించింది. వెంటనే పాము ఆ ఎలుకను పట్టుకొని బయటకు తీసింది. ఆ తర్వాత ఆ పాము దానిని పరిశీలించి చూస్తే అది ఒక బొమ్మ ఎలుక!
ఆ బొమ్మ ఎలుకను ఒక కోతి పట్టుకొని వచ్చి ఆ ఎలుక కన్నం ముందు పడవేస్తే దానిని ఆ కన్నంలోని ఎలుకలోనికి పట్టుకొని వచ్చింది. ఆ పాము దానిని నిజమైన ఎలుక అనుకుంది. ఆ పాము నిరాశతో వెనక్కి తిరిగి కప్పవైపు చూసింది. కానీ అక్కడ కప్ప లేదు. అది పక్కనే ఉన్న ఏ రాయి కిందకో పారిపోయింది. ఇంతలో దాని నివాసానికి వస్తున్న ఆ కన్నంలోని నిజమైన ఎలుక ఆ పామును చూసి వెనక్కు తిరిగి పారిపోయింది. అది చూసిన పాము ‘అయ్యో! ఆ కప్ప మాటలకు మోసపోయి దొరికిన ఆహారాన్ని పోగొట్టుకున్నానే!’ అని చింతించింది.
Read also: hindi.vaartha.com
Read also: A Moral Lesson to the Fox:నక్కకు గుణపాఠం