మంచి వర్తక కేంద్రంగా కార్వేటినగరం అభివృద్ధి చెందసాగింది. గ్రామీణ ప్రజలు తమ వస్తు విక్రయాల కోసం నగరానికి వచ్చి వ్యాపారం చేసేవారు. పొరుగు రాజ్యాలవారు సైతం వ్యాపార నిమిత్తం తరచుగా వచ్చి వెళ్లేవారు. రోజు. రోజుకీ నగరం ఆర్ధికం గా అభివృద్ధి చెందసా.
నగరం విస్తరించేకొద్దీ కొందరు వీధులను కొంచెం.. కొంచెం ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. సరైన నిర్వహణ లేక వీధులన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయి, దర్గంధం వ్యాపించ సాగింది. నగరానికి వచ్చిపోయే ప్రజలు ఇబ్బంది పడసాగారు.
ఆక్రమణలవల్ల ప్రధాన వీధులన్నీ ఇరుకు అయ్యాయి, అనేక దారులు మూసుకుపోయాయి. దీంతో దూర ప్రయాణికులు చుట్టి రావలసి వచ్చేది. చుట్టి రావడం శ్రమ, ఖర్చులతో కూడినం దువల్ల గ్రామస్తులకు గిట్టుబాటు కాక నగరానికి రావడం మానుకున్నారు.
పొరుగు రాజ్యాల వ్యాపా రులు కూడా చిన్నగా తమ వ్యాపారాల కోసం వేరే. రాజ్యాల వైపు వెళ్లసాగారు. క్రమంగా నగరంలో వ్యాపార అభివృద్ధి కుంటుపడింది. ఇదిలా ఉండగా.. ఆక్రమణదారులు రాజావారి వీధిని కూడా ఆక్రమించడంతో రాజుకు కోపం వచ్చింది.
ఆక్రమింపబడ్డ వీధులను చూసి రాజు బాధపడ్డాడు.. వీధులను వెడల్పు చేయించాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే వీధులన్నీ విశాలం చేసి, చిన్న చిన్న మరమ్మత్తులు చేసి శుభ్రంగా ఉంచాలని సేవకులకు ఆజ్ఞాపించాడు.
నాలుగు రోజుల తరువాత “పనులు ఎలా జరుగు తున్నాయో చూసి వద్దామని” వెళ్లాడు. అక్కడ కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి, అందులో భాగంగా వీధి మొదట్లో ఉన్న రాజావారి వీధి శిలాఫలకం విరిగి ఉంది. రాజు చాలా భావోద్వేగా నికి గురయ్యాడు.
కొద్దిసేపటికి తేరుకుని “ఎందుకు బాధకు గురి అవుతున్నానా?” అని ఆలోచనలో పడ్డాడు. తన పేరిట ఉన్న సూచిక విరగడం తన మనసుకు నొప్పి పుట్టిస్తున్నట్లుగా గుర్తించాడు. ప్రతి మనిషికి తనకు మించినది. ఏదీ ముఖ్యం కాదని అర్థమైంది. మదిలో మెరుపు లాంటి ఆలోచన తళుక్కున మెరిసింది.
వెంటనే నగరంలోని సంపన్నులందరినీ సమావేశపరిచాడు. నగరంలోని వీధులకు వారి పేర్లు పెడుతు న్నట్లు ప్రకటించాడు. ఇకపై వీధుల నిర్వహణ బాధ్యత మీదేనన్నాడు. వారికి సహాయంగా సైనిక సిబ్బందిని ఏర్పాటు చేశాడు.
వారి పేర్లతో అందమైన శిలా ఫలకాలు తయారు చేయించాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, మేళతాళాలతో సంపన్నుల కుటుంబ సభ్యుల చేత శిలాఫలకాలకు ప్రారంభోత్సవం చేయించాడు. వారి పిల్లల చేత వీధులకు ఇరు వైపులా మొక్కలు నాటించాడు.
సమయం దొరికినప్పుడల్లా వారిని వీధుల్లో పర్యటించమని కోరాడు. వీధులకు తమ పేర్లు. పెట్టడం, శిలాఫలకాలు చేయించడంతో సంపన్ను లలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఊహించని గుర్తింపుకు వారు ఉబ్బితబ్బియ్యారు. సమాజంలో తమ పేరు ప్రతిష్ఠలు పెరిగాయని పొంగిపోయారు.
చెడ్డ పేరు రాకుండా తమకి అప్పగించిన వీధులను శుభ్రంగా ఉంచుకోవడం ప్రారంభించారు. పిల్లలు వీధులకు ఇరు వైపులా మొక్కలు నాటడంతో వీధులన్నీ రంగుల హరివిల్లు లైనాయి. ఎప్పటిక ప్పుడు ఆక్రమణదారుల వివరాలు రాజుకు అందించి ఆక్రమణలను నియంత్రించారు.
ఆదాయం పోగొట్టు కున్న ఆక్రమదారులు తప్పు తెలుసుకున్నామని, క్షమాపణలు కోరడంతో రాజు వెంటనే ఒక వ్యాపా ర కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించాడు. కొద్ది రోజులు గడిచాక నగరం రూపురేఖలు మారిపోయాయి. గ్రామస్తుల, పొరుగు రాజ్యాల వ్యాపారుల రాకపోకలు తిరిగి ప్రారంభమై వ్యాపారం ఊపు అందుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: