Great wealth : గొప్ప సంపద

Follow Us: Google News Daily Hunt
great wealth
great wealth
FONT SIZE
GET APP

పార్వతిపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసాద్, ప్రభాకర్ చదువుతున్నారు. ప్రసాద్ తెలివైనవాడే అయినా అల్లరిపిల్లల సహవాసం మొదలుపెట్టి, సినిమాలు, షికార్లు, చిరుతిండ్లతో జల్సాలు, కాలక్షేపం చేస్తూ కాలం వృధా చేసుకోసాగాడు. జల్సాలు మాని బాగా చదువుకోమని ప్రభాకర్ ఎంత చెప్పినా ప్రసాద్ వినేవాడు కాదు. ఫలితంగా ప్రసాద్కి బాగా తక్కువ 2 మార్కులు, ప్రభాకర్కి ఎక్కువ మార్కులు వచ్చేవి. అందరూ ప్రభాకర్ ని మెచ్చుకుంటుంటే ప్రసాద్ ఓర్వలేకపోయేవాడు. ప్రభాకర్కి కూడా తక్కువ మార్కులు వచ్చేలా చేసి ప్రభాకర్కి మంచి పేరు రాకుండా చేయాలని ప్రసాద్ భావించి, పరీక్షలు రాగానే ప్రభాకర్కి తెలియకుండా ప్రభాకర్ నోట్స్లు కాజేసాడు. ఇంటికి వచ్చి ప్రభాకర్ బ్యాగ్ లో చూసుకుంటే నోట్స్లు కనిపించలేదు. 

ప్రభాకర్ చాలా బాధపడ్డాడు. ఈసారి పరీక్షల్లో ప్రభాకరికి తనకంటే ఘోరమైన తక్కువ మార్కులు వస్తాయని ప్రసాద్ భావించి తెగ సంబరపడిపోయాడు. పరీక్షలు వచ్చాయి. అందరూ రాసారు. టీచర్లు ఫలితాలు ప్రకటిస్తూ విద్యార్థులు పేపర్లు చూసుకోవటానికి ఇచ్చి, మళ్లీ తీసుకున్నారు. ఆశ్చర్యం..! ప్రభాకర్కి చాలా తక్కువ మార్కులు వస్తాయని ప్రసాద్ భావిస్తే, ప్రసాద్ అంచనాలు తలకిందులు చేస్తూ ఇదివరకులాగే ప్రభాకర్కి చాలా ఎక్కువ ‘మార్కులు వచ్చాయి. ప్రభాకర్ని అందరూ మెచ్చుకుంటుంటే ఎప్పట్లాగే ప్రభాకర్ని అందరూ మెచ్చుకున్నారు. అప్పటివరకు ఓర్వలేకపోయిన ప్రసాద్ ఈసారి ఏమాత్రం బాధపడకుండా ఆలోచనలో పడ్డాడు. “నేను ప్రభాకర్ నోట్స్ కాజేసినా అతడు ఇదివరకే అన్నీ చదువుకొని, ఎప్పటి పని అప్పుడే చేసుకోవటం వల్ల నోట్లు పోయినా ఆ ప్రభావం ఏం లేకుండా ఇది ఇదివరకులాగే ప్రభాకర్కి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎవరైనా, ఏదైనా దోచుకోవచ్చుగానీ చదివిన చదువుని ఎవరూ దోచుకోలేరు. 

ఎవరైనా సంపదను పోగొట్టుకుంటారుగానీ చదువును పోగోట్టుకోలేరు. చదువు శాశ్వతంగా ఉంటుంది. అంటే అన్ని సంపదల కంటే చదువు ఒక్కటే విలువైన గొప్ప సంపద. అటువంటి గొప్ప సంపద విలువ నేను తెలుసుకోకుండా ఎంతో విలువైన కాలాన్ని జల్సా జీవితంతో వృథాగా గడిపేశాను. అదీగాకుండా ప్రభాకర్ని చూసి ఓర్వలేక అతనిపై అక్కసు పెంచుకున్నాను. అతని నోట్స్ కాజేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అతని నోట్స్ అతనికిచ్చేసి ప్రభాకర్ని క్షమాపణ అడుగుతాను. నేను కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుని ప్రభాకర్ మెప్పు పొందాలి” అని మనసులో అనుకుని అలాగే నడచుకోసాగాడు. ప్రసాద్ మారినందుకు ప్రభాకర్ చాలా సంతోషించాడు. ఇప్పుడు ప్రసాద్ కూడా ప్రభాకర్తో పాటు అందరి అభినందనలు పొందసాగాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Abhinav

రచయిత గురించి

Abhinav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు