ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు.

ఈ సారి ఢిల్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ రెండు గట్టిగా ట్రై చేసాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయం తో బిజెపి సంబరాలు చేసుకుంటుంది. ఇక తగ్గేదేలే అంటూ స్వీట్స్ పంచుకుంటున్నారు.
ఈ విజయంపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని , విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు. గత పదేళ్లలో ప్రజల కోసం ఎంతో పనిచేశామని, ఓడిపోయినా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పోరాడిన ఆప్ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.