हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Kalyan Ram: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్

Anusha
Kalyan Ram: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.ఈ చిత్రం శుక్రవారం, ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా,ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన పొందుతోంది.మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

రెస్పాన్స్

సక్సెస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ తన కుమారుడికి చాలా బాగా నచ్చిందని చెప్పాడని తెలిపారు. మనం నమ్మిన కొన్ని విషయాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్. అమ్మ విజయశాంతితో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర వేశారు. ఆయన పాత్రకి సంబంధించిన ట్విస్ట్ బాగుందని అంటున్నారు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ ఇలా ప్రతీ అంశాన్ని అందరూ పొగుడుతున్నారని,అజనీష్ లోక్ నాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది. క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్. ఈరోజు పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసి వచ్చాడు. ‘నాన్నా ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకూ చూడలేదు. ఇది నిజమా అని నేను షాక్ కి గురయ్యాను. చాలా గర్వంగా ఉంది నాన్న’ అని అన్నాడు. తల్లీ కొడుకుల మధ్య ఎమోషన్ ని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశ్యం. తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాం, ఎంత త్యాగం చేసాం అనేది ముఖ్యం కాదు. వారి పట్ల మనం ఎంత బాధ్యతగా ఉన్నాం. ఎంత దూరం వెళ్ళాం అనేది ఈ సినిమా ద్వారా చెప్పాం కళ్యాణ్ రామ్ అన్నారు

 Kalyan Ram: 'అర్జున్ సన్ ఆఫ్  వైజయంతి' మూవీ  సక్సెస్ మీట్ లో పాల్గొన్న  కళ్యాణ్ రామ్

ప్రత్యేక స్థానం

సినిమాలో ఎంత ఎమోషన్ ఉందో నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వారితో కూడా నాకు అంతే ఎమోషన్ ఉంది. మదర్, సన్ మధ్య ఉండే ఎమోషన్ ని ఎక్స్ట్రీమ్ లెవల్ లో చూపించాం. డైరెక్టర్ ప్రదీప్ మొత్తం క్రెడిట్ కొట్టేశాడు. ఈ కథ రాసినందుకు, నన్ను నమ్మి నా దగ్గరికి తీసుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రచయిత శ్రీకాంత్ విస్సాని ఎప్పటికీ మర్చిపోను. నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది” అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

Read Also: Jaat Movie: జాట్ మూవీ వివాదం స్పందించిన నిర్మాణ సంస్థ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870