Wheat Halwa:కడా ప్రసాదం (గోధుమ హల్వా)

Read Time:  1 min
Wheat Halwa
Wheat Halwa
FONT SIZE
GET APP

Wheat Halwa:కావలసిన పదార్థాలు:

  • గోధుమపిండి – 1 కప్పు
  • పంచదార – 1 కప్పు
  • నెయ్యి – తగినంత
  • జీడిపప్పులు – 5
  • కిస్మిస్ – 5
  • ఏలకుల పొడి – 1 స్పూన్
Wheat Halwa

తయారు చేసే విధానం:

స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. వేడెక్కేక ముందుగా నెయ్యి వేసుకుని, తరువాత గోధుమపిండిని వేసి ఉండ కట్టకుండా బాగా కలుపుతూ, ఈ మిశ్రమానికి పంచదార (sugar) చేర్చాలి. ఈ పదార్థాలు బాగా కలుపుతూ కొంచెం కొంచెంగా నీరు పొయ్యాలి. బాగా కలుపుతూ ఉంటే కొంచెం ముద్దగా వస్తుంది. నీరు ముందే ఎక్కువగా పోయకుండా కొద్దికొద్దిగా ముద్దగా, దగ్గర పడేవరకు పోసుకోవాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్(Raisins) వేసుకొని, ఏలకుల పొడి కలుపుకోవాలి. పంచదార బదులు బెల్లంతో కూడా చేయవచ్చు.

Wheat Halwa

Read also: hindi.vaartha.com

Read also:Moringa Leaves with Tapioca Flour Curryమునగాకు – తెలగపిండి కూర

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.