RBI Recruitment 2026: ఆర్‌బీఐలో 650 ఉద్యోగాలు: వివరాలు ఇవే

Read Time:  1 min
RBI Recruitment 2026: ఆర్‌బీఐలో 650 ఉద్యోగాలు: వివరాలు ఇవే
FONT SIZE
GET APP

RBI Recruitment 2026: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్బీఐ కార్యాలయాల్లో మొత్తం 650 అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

Read also: Government Jobs India: ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు

RBI Recruitment 2026: 650 jobs in RBI: Here are the details
RBI Recruitment 2026: 650 jobs in RBI: Here are the details

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 16
  • దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 8

అర్హతలు మరియు ఇతర వివరాలు

  • విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
  • వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹450 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ₹50 మాత్రమే.
  • జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపు ₹29,000 ప్రాథమిక వేతనం లభిస్తుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.