అధ్యక్షుడు జేడీ వాన్స్ యే: ఎలాన్ మస్క్

అధ్యక్షుడు జేడీ వాన్స్ యే: ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ, భవిష్యత్తులో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎదగగలరని అభిప్రాయపడ్డారు. మస్క్ ఈ వ్యాఖ్యలు ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇటీవలి కాలంలో, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) ప్రభుత్వ విభాగాలలో ప్రక్షాళన కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది ఇతర దేశాలకు ఇస్తున్న నిధులను కూడా తగ్గిస్తూ, అమెరికా ఖర్చులను తగ్గించి, ఆదాయం పొదుపు చేయడంలో దృష్టి సారించింది.

Advertisements

జేడీ వాన్స్

జేడీ వాన్స్, ఓహియో నుండి సెనేటర్‌గా ఎన్నికైన తర్వాత, తన విధేయత, ప్రజాసేవా నైపుణ్యాలతో గుర్తింపు పొందారు. మస్క్ వంటి ప్రముఖ వ్యక్తుల నుండి వచ్చిన ప్రశంసలు, వాన్స్ రాజకీయ భవిష్యత్తుపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న జేడీ వాన్స్‌ అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. ఆయన దేశానికి కాబోయే అధ్యక్షుడు అంటూ మస్క్‌ ఓ పోస్టుకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడలో మస్క్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

రెండుసార్లు మాత్రమే పదవికి పోటీ

అమెరికాలో రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే విషయంపైప్రపంచ కుబేరుడు, ట్రంప్ కు సీనియర్ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో మస్క్ అనేక అంశాల్లో మాట్లాడే మాటలు ఆసక్తికరంగా ఉంటుంటాయి. అతను ఏం మాట్లాడినా, చెప్పినా ఆ విషయంపై గట్టిగానే చర్యలు జరుగుతుంటాయి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాలకు విస్తరిస్తూ లక్షల కోట్లకు అధిపతిగా మారిన ఎలాన్ మస్క్ఎ న్నికల్లో ట్రంప్ పాల్గొంటున్నప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామిగా మారి అనేక అంశాలను దగ్గరిగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికైనా అత్యుత్తమంగా ప్రభుత్వంలో పని చేస్తున్న మన ఉపాధ్యక్షుడే.. మనకు కాబోయే అధ్యక్షుడు అంటూ వ్యాఖ్యానించారు. దాంతో జేడీ వాన్సన్ పనితీరుపై, ఆయన రాజకీయ కెరీర్ లో అందుకోబోయే అత్యున్నత పదవిపై మస్క్ తన అభిప్రాయాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా వెల్లడించినట్లైంది.

elon musk 3069062


40 ఏళ్ల జేడీ వాన్స్అమెరికా చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడిగా గుర్తింపు సాధించారు. ఈయన గతంలో ఒహియో నుంచి సెనేటర్గా ఎన్నికైన వాన్సన్.రచయితగా, న్యాయవాదిగా వివిధ వృత్తుల్లో కొనసాగారు. వాస్తవానికి జేడీ వాన్స్ ఒకప్పుడు ట్రంప్ను తీవ్రంగా విమర్శించే వర్గంలో ఉండే వాడు. కానీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ట్రంప్ వర్గానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత అతను ట్రంప్ నకు అతిపెద్ద మద్దతుదారుగా మారిపోయారు. ప్రస్తుతం ఉపాధ్యాక్షుడిగా ఉన్నప్పటికీ.జేడీ వాన్స్ అమెరికా ప్రభుత్వ యంత్రాగంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అందుకే అతను మస్క్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు. కాగా జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారతీయ మూలాలున్న అమెరికన్. ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్లి న్యాయవాదవృత్తిలో ప్రముఖ స్థానానికి ఎదిగారు. ఆమె యేల్ లా స్కూల్ లోవిద్యనభ్యసించారు. అక్కడే ఆమెకు జేడీ వాన్స్ తో పరిచయం ఏర్పడింది.కాస్తా పెళ్లివరకు వెళ్లింది. ఉషా-జేడీ వాన్స్ కు ఇద్దరు పిల్లలున్నారు. ఉషా భారతీయ కుటుంబమూలాల కారణంగా జేడీ వాన్స్ కు కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటుఇక్కడి విలువలపై అవగాహన ఉంది అంటుంటారు. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో భారతీయులు వాన్స్ కు, ట్రంప్ నకు మంచి మద్దతు అందించారు.

Related Posts
Indian Students: అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో వెంటాడుతున్న భయాలు!
అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో వెంటాడుతున్న భయాలు!

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకప్పుడు ఎంతో ఆశావహంగా కనిపించిన అమెరికా కల, ఇప్పుడు ఆందోళనలు, భయాలతో Read more

Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ‘
నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'పీపుల్స్ మూవ్‌మెంట్ '

నేపాల్‌లో రాచరికం మద్దతుదారుల 'పీపుల్స్ మూవ్‌మెంట్ ' మొదటి రోజే హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో రాచరిక అనుకూల శక్తులు తమ Read more

మార్క్ బర్నెట్‌ను యూకే ప్రత్యేక రాయబారిగా నియమించిన ట్రంప్
Mark Burnett

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలకమైన ప్రకటన చేశారు. ఆయన ప్రముఖ టెలివిజన్ నిర్మాత అయిన మార్క్ బర్నెట్‌ను యూకే (ఐక్యరాజ్యమైన బ్రిటన్)కి ప్రత్యేక Read more

బ్రెజిల్ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపుతున్న అమెరికా
immigrants brazil

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టుగానే వలసదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వారిని అత్యంత దారుణంగా వెనక్కి పంపిస్తోంది. తాజాగా పదుల సంఖ్యలో బ్రెజిల్ వలసదారులను Read more

×