బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా సీక్రెట్ కెమెరాతో వీడియోను రికార్డు చేశాడు ఓ జవాన్. అక్కడితో ఆగకుండా బాధితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సైనికుడిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ ఘటన జరిగింది. ఈతంగాడు ప్రాంతానికి చెందిన మధురాజా, మిజోరాంలో ఇండియన్ ఆర్మీ(Army) లో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలి గృహప్రవేశ వేడుకకు తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. అప్పటినుంచి వారి ఇంటిని టార్గెట్ చేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఈతమోళి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం కొత్త ఇల్లును నిర్మించుకుంది. ఈ క్రమంలోనే మహిళ కుటుంబం గృహ ప్రవేశం ఫంక్షన్ చేసింది. ఈ కార్యక్రమానికి బంధువులు, శ్రేయాభిలాషులను ఆహ్వానించింది. ఈ ఫంక్షన్‌కు వెల్లిసంధై సమీపంలోని ఈతంగాడు ప్రాంతానికి చెందిన ఆర్మీ (Army) జవాన్ మధురాజా కూడా తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. విధుల కోసం మిజోరాంలో ఉన్న మధురాజా, ఇప్పటివరకు పలు సార్లు సెలవుపై ఇంటికి వచ్చాడు. ప్రతీసారి బాధితురాలిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరిసారి వచ్చినప్పుడు, ఆమె స్నాన వీడియోను చూపించి లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు.

బాత్రూంలో కెమెరా అమర్చిన విధానం
మిజోరాంలో ఇండియన్ ఆర్మీ(Army) లో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్న మధురాజా మహిళ ఇంటి బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చాడు. ఆ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్లో చూసేవాడు. బాత్రూంలోని కెమెరాను తన మొబైల్‌కు లింక్ చేసి మహిళ స్నానం చేస్తున్న వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం విధుల నిమిత్తం మిజోరంకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెలవుపై ఇంటికి వచ్చినప్పుడల్లా బాధిత మహిళను లైంగికంగా వేధించేవాడు.మధురాజా బాత్రూంలో కెమెరా అమర్చిన విధానంపై ఇతర మహిళలపైనా ఇలాంటి చర్యలు తీసుకున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ఫారెన్సిక్ పరిశీలన, అతని ఫోన్, కెమెరాల డేటా – అన్నీ పరిశీలించబడతాయి. అయితే, ఇటీవలే సెలవులపై స్వగ్రామానికి వచ్చిన మధురాజా, బాధితురాలిని కలిశాడు. ఆమె స్నానం చేస్తున్న వీడియోను సెల్ ఫోన్ లో చూపించి మరోసారి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. తన లైంగిక కోరికలను తీర్చకపోతే ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. స్నేహితులు, బంధువులకు పంపిస్తానని చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన మహిళ ఎతమోళి పోలీస్ స్టేషన్లో జవాన్‌పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని జైలుకు తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Read Also: Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం