తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల (Telangana State Irrigation) శాఖలో అకస్మాత్తుగా కీలక మార్పు జరిగింది. ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా ఉన్న జి. అనిల్ కుమార్‌ను G. Anil Kumar ప్రభుత్వం తొలగించింది. ఆయనకు కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా, తక్షణమే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ బదిలీ వెనుక ప్రధాన కారణం మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన గ్రౌటింగ్ పనులే అని సమాచారం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల నివేదిక ప్రకారం, గ్రౌటింగ్ జరగడం వల్ల పూర్తిస్థాయి నిర్మాణ పరీక్షలు అసాధ్యమయ్యాయని తెలుస్తోంది. ఈ అంశం పై అనిల్ కుమార్ తీరుపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి.
సీఎం స్థాయిలో చర్చ
ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని తెలుస్తోంది. గ్రౌటింగ్ పనులు ఎవరొచ్చి ఆదేశించారన్న దానిపై స్పష్టత లేకపోవడం, నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఇవ్వాల్సిన అవసరం రావడం వల్ల ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంది.ఇంతకుముందు బదిలీ అయిన ఈఈ నూనె శ్రీధర్ పాత పోస్టులోనే కొనసాగుతుండటం వెనుక అనిల్ కుమార్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కూడా ఈ బదిలీకి కారణమైనట్లు తెలుస్తోంది.
అంజద్ హుస్సేన్‌కు కీలక బాధ్యతలు
అనిల్ కుమార్ స్థానంలో చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న అంజద్ హుస్సేన్‌ను ఈఎన్సీ జనరల్‌గా అదనపు బాధ్యతలతో నియమించారు. ఇప్పటికే ఆయన అడ్మిన్ విభాగానికి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు రెండు కీలక హోదాల్లో కొనసాగనున్నారు.ఈ ఉత్తర్వులు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ గ్రౌటింగ్ వివాదం వల్ల నీటిపారుదల శాఖలో గణనీయమైన ప్రభావం చూపుతున్నట్లు చూస్తున్నాం.
Read Also : Nara Lokesh : విద్యార్థులతో సూర్యనమస్కారాలు : ఇది గర్వించాల్సిన రోజన్న నారా లోకేశ్