క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. 2008లో మొదటి సీజన్‌తో మొదలైన ఈ క్రికెట్ మేళా 18వ సీజన్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఉత్కంఠను పంచుతుంది. ఈ సారి ఐపీఎల్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. కొత్త కాంబినేషన్లు, అనుభవసంపన్నులు, యువ టాలెంట్ కలబోసిన జట్లు – అన్ని ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చబోతున్నాయి. టోర్నీకి ముందు జరిగిన వేలంలో పలు ఆశ్చర్యకరమైన బిడ్డింగ్‌లు చోటు చేసుకున్నాయి. ఏ జట్టు బలంగా మారింది? ఎవరు కొత్తగా చక్కటి ప్రదర్శన ఇస్తారో చూడాలి.

2025 ఐపీఎల్ ప్రారంభ సమరం
ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. గతేడాది కేకేఆర్ అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఏడాది ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్‌లో గడచిన 17 సీజన్ల రికార్డులు విరాట్ కోహ్లీ – 8004 పరుగులు, 2008 నుంచి ఒకే ఫ్రాంచైజీ ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈ ఏడాది కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తే, 9000 పరుగుల మార్కును చేరుకునే అవకాశముంది. యుజ్వేంద్ర చాహల్- 205 వికెట్లు గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన చాహల్, ఈసారి కూడా తన స్పిన్ మాంత్రికతను కొనసాగిస్తే మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం. విరాట్ కోహ్లీ – 8 సెంచరీలు టీ20 క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత తేలికైన పని కాదు. కానీ విరాట్ ఐపీఎల్‌లోనే 8 శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. డేవిడ్ వార్నర్ – 66 అర్ధ శతకాలు వరుసగా మూడు సీజన్లలో 600+ పరుగులు చేసిన ఏకైక విదేశీ ఆటగాడు వార్నర్. క్రిస్ గేల్- 357 సిక్సర్లు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇప్పటికీ ఐపీఎల్ సిక్సర్ల రాజుగా ఉన్నాడు. శిఖర్ ధావన్- 768 ఫోర్లు ధావన్ తన ఫ్లోలో ఉంటే బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తాడు. ఏబీ డివిలియర్స్- 25 అవార్డులు ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ మ్యాచువిన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాడు. అత్యధిక స్కోరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేయడం అసాధారణమైన రికార్డు. విరాట్ కోహ్లీ – 114 క్యాచ్‌లు బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లో కూడా విరాట్ అత్యుత్తమ ఆటగాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ధోనీ అంతటి లీడర్ మరొకరు లేరు. ఎంఎస్ ధోనీ – 226 మ్యాచ్‌లు కెప్టెన్సీ అంటే ఏమిటో ధోనీ నిరూపించాడు.
అత్యధిక సార్లు ఐపీఎల్ ఛాంపియన్
ముంబై ఇండియన్స్ (MI) – 5 టైటిళ్లు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – 5 టైటిళ్లు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా నిలిచాయి. ఈ సారి కొత్త ప్లేయర్లు, ఆసక్తికరమైన మ్యాచ్‌లు, కొత్త రికార్డులు, ఉత్కంఠపూరిత సమరాలు ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.